దంతాలు తెల్లగా మెరవాలంటే....కొన్ని ఆహారాలు

ఈ మధ్య కాలంలో దంతాల సమస్యలు ముఖ్యంగా చిగుళ్ల సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి.ఇవి రావటానికి కొన్ని ఆహారాలు కూడా కారణం అవుతాయి.

 Foods That Will Whiten Your Teeth Naturally, Foods , Teeth, Good Health , Health-TeluguStop.com

అలాగే దంతాల మీద ఎక్కువగా పాచి పట్టటం,గార పట్టటం వంటి సమస్యలు కూడా రావటం మనం చేస్తూనే ఉన్నాం.ఈ సమస్యల నుండి బయట పడి దంతాలు తెల్లగా మెరిసిపోవాలంటే ఈ ఆహారాలను తీసుకోవాలి.ఆ ఆహారాల గురించి వివరంగా తెలుసుకుందాం.

స్ట్రాబెర్రీ

స్ట్రాబెర్రీలలో మాలియిక్ యాసిడ్ అనే ఎంజైమ్ ఉండుట వలన సహజసిద్ధమైన బ్లీచింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది.అలాగే ఈ పండ్లలో ఉండే విటమిన్ సి కూడా దంతాలను తెల్లగా మార్చటంలో సహాయపడుతుంది.తరచుగా స్ట్రాబెర్రీ పండ్లను తింటూ ఉంటే దంతాల మధ్య ఇరుక్కున్న వ్యర్ధాలు కూడా తొలగిపోతాయి.

ఈ మధ్య కాలంలో స్ట్రాబెర్రీ అమ్మకాలు కూడా బాగా పెరిగాయి.అందరికి అందుబాటులో ఉంటున్నాయి.

ఆపిల్

దంతాల చిగుళ్ళను బలంగా చేసి దంతాలు తెల్లగా చేసే పోషకాలు ఆపిల్ లో చాలా సమృద్ధిగా ఉన్నాయి.అంతేకాక నోటిలో చెడు బ్యాక్టీరియా తొలగిపోతుంది.

దాంతో దంతాల సమస్యలు తొలగిపోతాయి.

బ్రకోలి

దీనిలో ఫైబర్ సమృద్ధిగా ఉండుట వలన దంతాలను తెల్లగా మార్చటంలో చాలా బాగా సహాయపడుతుంది.

ఉల్లిపాయ

ఉల్లిపాయ తింటే నోరు అంతా వాసన వస్తుందని చాలా మంది పచ్చి ఉల్లిపాయన తినటానికి ఇష్టపడరు.అయితే ఉల్లిపాయతో ఉండే సల్పర్ నోటి సమస్యలను తొలగించటమే కాక దంతాలను తెల్లగా మారుస్తుంది.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube