సాధారణంగా ప్రతి ఒక్కరు ఎన్నో వాస్తు నియమాలను తప్పనిసరిగా పాటిస్తూ ఉంటారు.ఈ క్రమంలోనే వాస్తు శాస్త్రం ప్రకారం చాలా మంది ఇంట్లో మనీప్లాంట్ పెట్టుకోవడం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని భావిస్తారు.
ఈ క్రమంలోనే ప్రతి ఒక్క ఇంటిలోనూ మనకు మనీ ప్లాంట్ కనబడుతుంది.అయితే వాస్తు శాస్త్ర ప్రకారం మనీ ప్లాంట్ ఏ దిశలో ఉండటంవల్ల ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి? ఎలాంటి మనీప్లాంట్ ఇంట్లో ఉండాలి? మనీప్లాంట్ విషయంలో ఎలాంటి నియమాలు పాటించాలి అనే విషయానికి వస్తే.
మనీ ప్లాంట్ మన ఇంటి కుడి భాగాన ఉండాలి.అలాగే ఇంటిలో ఆగ్నేయ దిశగా మనీ ప్లాంట్ నాటడం వల్ల ఇంట్లో సానుకూల వాతావరణం ఏర్పడటమేకాకుండా ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడతాయి.
అయితే మనీప్లాంట్ కుండీలో కాకుండా గాజుసీసాలో పెట్టడం ఎంతో మంచిది.అలాగే మనీ ప్లాంట్ సాధారణ ఆకులు మాదిరిగా కాకుండా మనీ ప్లాంట్ ఆకులు హృదయాకారములో ఉన్నటువంటి చెట్లను పెంచుకోవడం ఎంతో మంచిది.
ఈ విధమైనటువంటి చెట్టు ఇంట్లో ఉండటం వల్ల ఎల్లప్పుడు సానుకూల ప్రభావం ఉంటుంది.
మనీప్లాంట్ ఎప్పుడూ కూడా ఎండిపోకుండా జాగ్రత్తపడాలి.ఈ విధంగా మనీ ప్లాంట్ ఎండిపోవడం వల్ల మన ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయని అలాగే కుటుంబంలో ప్రతికూల వాతావరణం ఏర్పడి ఎన్నో సమస్యలు వస్తాయని సంకేతం.ఇకపోతే మనీప్లాంట్ ఎప్పుడూ కూడా బాత్రూం వైపు పెట్టకూడదు.
అలాగే పడకగదిలో మన మంచం దగ్గర మనీ ప్లాంట్ ను ఉంచుకోకూడదు.మనీ ప్లాంట్ ఎంత ఆరోగ్యంగా ఉంటుందో మన ఆర్థిక పరిస్థితి కూడా అలాగే ఉంటుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
పొరపాటున కూడా మనీ ప్లాంట్ ఆగ్నేయంలో కాకుండా ఈశాన్యంలో నాటడం వల్ల ఎన్నో ఆర్థిక సమస్యలు మనల్ని చుట్టుముడతాయి.