పెళ్లిలో నుదుట బాసికం ఎందుకు ధరిస్తారు?

మన భారతీయ సంప్రదాయంలో అనుసరించే కొన్ని పద్ధతులు ఆచారాలుగా మారిపోయాయి.అయితే ఆ ఆచారాల వెనక శాస్త్రీయమైన కారణాలు కూడా ఉన్నాయి.

 Basikam Enduku Kadataru-TeluguStop.com

ప్రాచీన కాలంలో హిందువులు ఏదైనా పనిని చేసేటప్పుడు దైవాన్ని ఆరాధించేవారు.ఆలా ఆరాదిస్తే చేసే పనికి ఆటంకాలు రావని నమ్మకం.

ఆ ఆచారాల్లో ఒకటైన పెళ్ళిలో బాసికం ఎందుకు కడతారో తెలుసుకుందాం.వివాహంలో బాసికానికి చాలా ప్రాముఖ్యత ఉంది.

బాసికం కట్టటం వెనక ఆధ్యాత్మికంగానే కాదు, శాస్త్రీయంగానూ ఎన్నో లాభాలు ఉన్నాయి.మానవ శరీరంలో దాదాపుగా 72 వేల నాడులు ఉన్నాయి.వాటిలో 14 నాడులు చాలా ముఖ్యమైనవి.ఇవి శరీరం ఎప్పుడు ఉత్తేజంగా ఉంచటానికి సహాయపడతాయి.ఈ 14 నాడుల్లో ఇడ, పింగళ, సుషుమ్మ అనేవి అతి ముఖ్యమైనవి.సుషుమ్న నాడికి కుడి పక్కన సూర్యనాడి, ఎడమ పక్కన చంద్రనాడి ఉంటాయి.

ఇవి నుదుట భాగంలో కలిసి అర్థచంద్రాకారంలో ఉంటుంది.వివాహ సమయంలో దీని మీద ఎవరి దృష్టి పడకుండా ఉండటానికి బాసికాన్ని కడతారు.బాసికం అర్ధచంద్రాకారం, త్రిభుజాకారం, చతురస్త్రాకారంలో ఉంటుంది.నుదుట భాగాన బ్రహ్మ కొలువుంటాని హిందువులు ప్రగాఢ నమ్మకం.

సాధారణంగా వివాహ సమయంలో వధూవరులను అందంగా అలంకరిస్తారు.వారి అలంకరణను చూసి అతిథులు, బంధువులు ముచ్చట పడతారు.అలా అందరూ చూసేటప్పుడు వారిపై నర దిష్టి కలుగుతుంది.ఈ నర దిష్టి కలగకుండా ఉండటానికి బ్రహ్మ కొలువున్న ఈ స్థానంలో బాసికాన్ని కడతారు.

దీని వల్ల భార్యభర్తల మధ్య బంధం మరింత బలపడుతుందని ఒక నమ్మకం కూడా ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube