ఏ దేవుని మాలలో ఏ రంగు దారాలు వాడాలి

హిందూ సంప్రదాయాల ప్రకారం మనకు ముక్కోటి దేవుళ్లు ఉన్నారు.అందులో చాలా దేవుళ్లకు మనం మాలలు వేస్కుంటూ ఉంటాం.

 Which Color Thread Use In Which God Mala Color Thread , Devotional , Pooja , Lo-TeluguStop.com

అయితే దేవుడికి ఇష్టమైన రంగు బట్టలనే వేస్కుని ప్రత్యేక పూజలు చేస్తుంటాం.అంతేనా నిష్టగా మండలం రోజులు పూజలు చేసుకొని, ఉపవాసాలు ఉండి దేవుడికి మొక్కులు సమర్పిస్తుంటాం.

అలాగే ఒక్కో దేవుడి మాలలో ఒక్కో రకమైన దారాన్ని వాడుతుంటాం.అయితే చాలా మందికి దీని గురించి తెలియదు.

అయితే ఏ దేవుడి మాలలో ఏ రంగు దారాన్ని వాడాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

శ్రీ మహా విష్ణువు మాలలో నల్లటి దారాన్ని లేదా పట్టు దారాన్ని లేదా నూలు దారాన్ని గానీ వాడాలని వేద పండితులు చెబుతున్నారు.

అలాగే అమ్మ వారికి ఎర్రటి పట్టుదారం మాలగానూ, పరమ శివుడికి పసుసు ఊలు దారాన్ని, సూర్య భగవానుడికి పట్టుదారం కానీ, నూలు దారం కానీ వాడాలంట.అలాగే విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరుడికి ఆకపచ్చ పట్టు దారం, నూలు దారం వాడాలి.

ధరించే వ్యక్తి గానీ లేదా తన ఇంటి పేరుతో ఉన్నవారు గానీ దారాన్ని చుట్టాల్సి ఉంటుంది.తనకోసం తను చుట్టింది ధరించడం అత్యంత శక్తివంతమైనదని వేద పండితులు వివరిస్తున్నారు.

వేరే ఎవరైనా చుట్టిన మాల ధరించే వారు ముందుగా పంచ గవ్వాలతో శుద్ధి చేసి పూజించిన తర్వాతే ధరించాలట.అలా చేస్తేనే మాల ధారణకు మోక్షం ఉంటుందట.

అందుకే ఏ దేవుడికి సంబంధించిన రంగు తాడుని ఆ మాలలో వాడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube