ఘనంగా సీతారాముల కల్యాణ వేడుకలు..

Sitaram's Wedding Celebrations , Sitaram, Yajnopavitham, Kankanadharana, Mangalyadharana, PD Raghuraman, PR Lokeshwari, Bhadrachalam

సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది.ముందుగా గోదావరి నుంచి తీర్థ బిందెను తెచ్చి గర్భ గుడిలో మూలవరులకు సుప్రభాత సేవ చేశారు.

 Sitaram's Wedding Celebrations , Sitaram, Yajnopavitham, Kankanadharana, Manga-TeluguStop.com

బాల భోగం నివేదించారు.ఆ తర్వాత కళ్యాణమూర్తులను బేడ మండపానికి తీసుకొచ్చి కళ్యాణం మొదలుపెట్టారు.

విశ్వక్షేన పూజ, పుణ్య హవాచనం, ఆరాధన తర్వాత యజ్ఞోపవితం, కంకణధారణ, జీలకర్ర బెల్లం, మాంగల్యధారణ, తలంబ్రాల వేడుక, మంత్ర పుష్పం సమర్పించారు.సాయంత్రం దర్గాలు సేవ జరిగింది.

మాధ్యాహ్నిక ఆరాధనలు తర్వాత రాజబోగం నివేదించారు.

Telugu Bhadrachalam, Bhakti, Devotional, Kankanadharana, Mangalyadharana, Pd Rag

సాయంత్రం దర్బారు సేవ జరిగింది.పిడి రఘురామన్, పిఆర్ లోకేశ్వరి దంపతులు శ్రీ సీతా రామచంద్ర స్వామి నిత్యాన్నదానానికి ఒక లక్ష రూపాయల విరాళం అందించారు.ఇంకా చెప్పాలంటే భద్రాచలం శ్రీ సీతా రామ చంద్ర స్వామి దేవస్థానంలో విశ్వరూప సేవ ఎంతో వైభవంగా జరిగింది.

వైకుంఠ ఏకాదశి తర్వాత వచ్చే బహుళ ద్వాదశి ఘడియల్లో దేవస్థానంలోని ఉత్సవమూర్తులన్నింటినీ ఒకే చోట చేర్చి ఆరాధన నిర్వహించడం శ్రీ సీతా రామ చంద్ర స్వామి దేవస్థానం ప్రత్యేకత.

Telugu Bhadrachalam, Bhakti, Devotional, Kankanadharana, Mangalyadharana, Pd Rag

ఈ దేవాలయంలోని 108 దేవతామూర్తులను ఒకే చోటకు చేర్చి ప్రత్యేక అలంకరణ చేయడంతో భద్రాద్రి కలియుగ వైకుంఠాన్ని తలపించింది.అంతా రామామయం జగమంత రామామయం అన్న భక్త రామదాసు కీర్తనలలో భాగంగా రాముడే విశ్వరూపుడిగా భావించి దేవాలయంలోని వరాహ స్వామి, వెంకటేశ్వర స్వామి కృష్ణుడు తదితర ఉత్సవమూర్తులతో పాటు ఆళ్వార్ల ఉత్సవ విగ్రహాలను సర్వదేవతాలంకారంలో అలంకరించారు.సాయంత్రం పూట ఆయన సన్నిధిలో ఇతర ఉత్సవమూర్తులకు ఆరాధన నిర్వహించి కందవం అనే ప్రత్యేక ప్రసాదాన్ని నివేదన చేస్తారు.

ఇలాగా ఎంతో ఘనంగా భద్రాచల శ్రీ సీతా రాముల కళ్యాణం జరిగింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube