Mahashivratri : మహాశివరాత్రి రోజు ఉపవాసం ఎందుకు ఉంటారో తెలుసా..?

మన దేశంలోని ప్రజలు ఎక్కువగా జరుపుకునే పండుగలో మహాశివరాత్రి( Mahashivratri ) ముఖ్యమైనది అని కచ్చితంగా చెప్పవచ్చు.శివునికి ఎంతో ఇష్టమైన ఈ రోజు మహా శివరాత్రి పండుగను జరుపుకుంటారు.

 Do You Know Why People Fast On Mahashivratri-TeluguStop.com

ముఖ్యంగా చెప్పాలంటే చాంద్రమాన మాసం ఫాల్గుణ మాసంలో 14వ రోజు ఈ పండుగను జరుపుకుంటారు.ఈ సంవత్సరం మార్చి 8వ తేదీన శివరాత్రి పండుగను జరుపుకుంటున్నారు.

ఈ రోజున అందరూ ఉపవాసాలు( fasting ) చేస్తూ ప్రత్యేక పూజలు చేస్తారు.అయితే శివరాత్రి రోజున ఉపవాసం ఎందుకు ఉంటారో.

ఉపవాసం చేస్తున్నప్పుడు పాటించాల్సిన నియమాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu Bakthi, Devotional, Fruits, Mahashivratri, Milk, Tiffins-Latest News - Te

అలాగే శివరాత్రి రోజున ఉదయం లేచి, స్నానాలు చేసి శివయ్య పూజకు సిద్ధం చేసుకోవాలి.ఉదయం ఉపవాసం చేయడం వల్ల ఎంతో పవిత్రత వస్తుందని చెబుతున్నారు.అందుకే హిందూ ప్రజలంతా ఈ రోజు ఉపవాసం ఉండి జాగారం చేస్తారు.

ఆ ఒక్క రోజు ఉపవాసం ఉండి జాగారం చేస్తే సంవత్సరం అంతా శివుడిని ఆరాధించిన పుణ్యం దక్కుతుందని చాలా మంది భక్తులు నమ్ముతారు.అలా చేయడం వల్ల మనం చేసిన పాపాలు తొలగిపోయి పుణ్యం కలుగుతుందని పండితులు చెబుతున్నారు.

Telugu Bakthi, Devotional, Fruits, Mahashivratri, Milk, Tiffins-Latest News - Te

మహాశివరాత్రి రోజు ఉపవాసం ఉండేవారు కొన్ని విషయాలను దృష్టిలో ఉంచుకోవాలని పండితులు చెబుతున్నారు.ఉపవాసం ఉండేవారి లో కొందరు అసలు నీళ్లు కూడా తాగకుండా ఉంటారు.అలా చేయడం వల్ల శరీరం శుభ్రం అవుతుందని భావిస్తారు.అయితే మరి కొందరు పండ్లు, పాలు, టిఫిన్స్( Fruits, milk, tiffins ) చేస్తారు.వాటికి బదులుగా ఇలాంటివి తీసుకుంటే మంచిదనీ ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.ముఖ్యంగా చెప్పాలంటే సగ్గు బియ్యం, మినుములు, గుమ్మడికాయ, బంగాళదుంపలు ఫుల్ మఖాన, అరటిపండు, పెరుగు వంటివి తీసుకోవచ్చు.

అలాగే గోధుమలు, బియ్యం, కూరగాయలు, పప్పులు వంటి ఆహారాలకు మాత్రం దూరంగా ఉండాలి.అలాగే శివునికి బియ్యం, పాలతో చేసిన తీపి వంటకాలను సమర్పిస్తే మంచిదని పండితులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube