తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సూపర్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పాటు చేసుకున్న మహేష్ బాబు( Mahesh Babu ) కృష్ణ కొడుకుగా ఇండస్ట్రీకి వచ్చినా కూడా తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ను ఏర్పాటు చేసుకొని సపరేట్ గా ఎదిగాడు.ఇక ఇండస్ట్రీలో ఎవరికి సాధ్యం కానీ విధంగా హ్యాండ్సమ్ హీరోగా కూడా ఇప్పటివరకు కొనసాగుతూ వస్తున్నాడు.
ఆయనకు ఏజ్ పెరిగే కొద్దీ అందం కూడా పెరుగుతూ వస్తుంది తప్ప తగ్గడం లేదు అంటూ చాలామంది అతన్ని చూసి కుళ్ళు కుంటున్నారు.
నిజానికి మహేష్ బాబు లాంటి అందగాడు ఇండస్ట్రీలో మరొకరు లేరు.
ఇక ఇది ఇలా ఉంటే మహేష్ బాబు తో సినిమాలు చేసే దర్శకులు సూపర్ హిట్ అయ్యే కథలను వదిలేసి వాళ్లకు నచ్చిన కథలతో సినిమాలు చేస్తున్నారు.నిజానికి మహేష్ బాబుతో ఒక యాక్షన్ ఎంటర్ టైనర్ తీస్తే సక్సెస్ సాధిస్తుంది అనే విషయాన్ని పూరి జగన్నాథ్ రెండుసార్లు ప్రూవ్ చేశాడు.
అయినప్పటికీ కొంతమంది దర్శకులు ఆయన్ని ఫుల్ ఫెడ్జ్ డ్ గా వాడుకోవడం లేదు.ముఖ్యంగా ఒక ముగ్గురు దర్శకులు మాత్రం ఆయన స్టార్ట్ డమ్ ను చాలా తక్కువగా అంచనా వేశారనే చెప్పాలి.
అందులో శ్రీకాంత్ అడ్డాల( Srikanth Addala ) ఒకరు.ఈయన బ్రహ్మోత్సవం( Brahmotsavam ) సినిమాతో మహేష్ బాబు స్టామినా ను చాలా తక్కువగా అంచనా వేశాడు.ఒక ఫ్యామిలీ సబ్జెక్టులో మహేష్ బాబు ను ఇన్వాల్వ్ చేసి సినిమా చేశాడు కానీ ఈ సినిమా భారీ డిజాస్టర్ అయింది.అయితే ఇంతకుముందు అదే డైరెక్టర్ సీతమ్మ వాకిట్లో అనే సినిమా కూడా చేసి మహేష్ కి సక్సెస్ ని అందించాడు.
అయినప్పటికీ అది భారీ సక్సెస్ అయితే కాదు.ఆబో ఆవరేజ్ గా ఆడింది.ఇక మహేష్ బాబుతో ఫ్యామిలీ సినిమాల కంటే యాక్షన్ సినిమాలు చేస్తే బెటర్…
సర్కారు వారి పాట( Sarkaru Vaari Paata ) సినిమాతో డైరెక్టర్ పరశురాం( Director Parasuram ) కూడా మహేష్ బాబు స్టామినాని పూర్తిస్థాయిలో వాడుకోలేదు.అందువల్లే ఆయన ఈ సినిమాని యావరేజ్ గా నిలిపాడు.అంతే తప్ప భారీ సక్సెస్ అయితే అందుకోలేకపోయాడు…ఇక రీసెంట్ గా త్రివిక్రమ్( Trivikram ) కూడా గుంటూరు కారం( Guntur Karam ) సినిమాతో మహేష్ బాబుని ఒక రేంజ్ లో చూపిస్తాడు అని అందరూ అనుకున్నారు.కానీ మహేష్ బాబు ప్రస్తుతం ఉన్న స్టార్ డమ్ ను గురూజీ కూడా అర్థం చేసుకోలేకపోయాడు.
ఇక దానివల్ల గుంటూరు కారం సినిమాని ఎలా తీయాలో తెలియకపోవడంతో దానివల్ల ఆ సినిమా పెద్దగా సక్సెస్ అయితే సాధించలేదు…
.