అన్ని జుట్టు స‌మ‌స్య‌ల‌కు చెక్ పెట్టే ఇన్‌స్టంట్ హెయిర్ ప్యాక్ పౌడర్ మీకోసం!

జుట్టు ఆరోగ్యంగా, ఒత్తుగా, పొడవుగా పెరగాలంటే పోషకాహారం తీసుకోవడంతో పాటు అప్పుడప్పుడూ హెయిర్ ప్యాక్స్‌ కూడా వేసుకుంటూ ఉండాలి.అయితే హెయిర్ ప్యాక్ లు వేసుకోవడానికి అవ‌స‌రం అయ్యే పదార్థాలు అంద‌రికీ అన్ని సార్లు అందుబాటులో ఉండ‌టం అసాధ్యం.

 Instant Hair Pack Powder Is For You To Get Rid Of All Hair Problems! Instant Hai-TeluguStop.com

కానీ, ఇప్పుడు చెప్పబోయే పౌడర్‌ను తయారు చేసుకుని పెట్టుకుంటే.ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్‌స్టంట్ గా హెయిర్ ప్యాక్ వేసుకోవచ్చు.

పైగా ఈ పౌడర్ ను వాడటం వల్ల వివిధ రకాల జుట్టు సమస్యలకు చెక్ పెట్టవచ్చు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ ఇన్‌స్టంట్ హెయిర్ ప్యాక్ పౌడర్ ను ఎలా తయారు చేసుకోవాలో ఓ చూపు చూసేయండి.

 Instant Hair Pack Powder Is For You To Get Rid Of All Hair Problems! Instant Hai-TeluguStop.com

ముందుగా రెండు అలోవెరా ఆకులు తీసుకుని నీటిలో శుభ్రంగా కడిగి సన్నగా స్లైసెస్ మారిది కట్ చేసుకోవాలి.ఈ అలోవెరా స్పైసెస్ ను ఎండలో ఎండబెట్టుకోవాలి.

పూర్తిగా ఎండిన‌ అలోవెరా స్లైసెస్ ను మిక్సీ జార్ లో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి.ఈ అలోవెరా పొడి లో నాలుగు టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడి, నాలుగు టేబుల్ స్పూన్ల మందారం పొడి వేసుకుని బాగా మిక్స్ చేసుకుంటే ఇన్‌స్టంట్ హెయిర్ ప్యాక్ పౌడర్ సిద్ధమయినట్టే.

ఈ పొడిని ఒక డబ్బాలో నింపుకుని స్టోర్ చేసుకోవాలి.

ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ పొడిని ఒక బౌల్‌లోకి తీసుకుని పెరుగు లేదా వాటర్ లేదా రైస్ వాటర్ లేదా కాఫీ డికాక్షన్ ను మిక్స్ చేసి హెయిర్ ప్యాక్ వేసుకోవాలి.ఈ ఇన్‌స్టంట్ హెయిర్ ప్యాక్ పౌడర్ ను వాడటం వల్ల జుట్టు రాలడం, చిట్ల‌డం, విర‌గ‌డం తగ్గుతాయి.చుండ్రు సమస్య నుంచి విముక్తి లభిస్తుంది.

ఆయిలీ హెయిర్ దూరమవుతుంది.మరియు కురులు ఒత్తుగా, పొడవుగా పెరుగుతాయి.

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube