మన భారతదేశ సంస్కృతిలో కట్టుబాట్లకు, హిందూ సంప్రదాయాలకు చాలా ప్రాధాన్యత ఉంది.అయితే ఇక్కడ చాలా సంప్రదాయాలకు ప్రత్యేకత ఉంది.
పిండ ప్రదానం ( Pinda pradanam ) కూడా భారతదేశం( India )లో ఓ సాంప్రదాయంగానే కొనసాగుతుంది.తల్లిదండ్రులు చనిపోయినప్పుడు వారి ఆత్మ శాంతించాలని కొడుకులు పిండ ప్రదానం చేస్తారు.
అయితే పిండ ప్రదానం కొడుకులు మాత్రమే చేయాలా.? కూతుర్లు చేయకూడదా.? అన్న సందేహం చాలా మందికి వస్తుంది.అయితే ఎవరైనా చనిపోయిన సమయంలో వారికి కొడుకులు లేనప్పుడు ఎవరు పిండ ప్రదానం చేయాలి? కూతురు పిండ ప్రధానం చేయవచ్చా? లేదా? అన్న సందేహాలు నెలకొంటాయి.

అయితే కుటుంబంలోని పెద్దలు చనిపోయిన సమయంలో కొడుకులు లేని సమయంలో వారి పిండాన్ని దానం చేయవచ్చని శాస్త్రం చెబుతోంది.హిందూ గ్రంధాల ప్రకారం తండ్రి మరణాంతరం వారి ఆత్మ శాంతి కోసం బంధాల నుండి విముక్తి చేయడానికి కొడుకులు పిండ ప్రదానం తర్పణం చేయాలి.అయితే పిండ ప్రదానం, తర్పణం చేయని పక్షంలో పితృదేవతల ఆత్మకు మోక్షం లభించదు.అయితే ఎవరికైతే కొడుకులు ఉండరో వారు వారి కుమార్తెలు తర్పణం వదలవచ్చు అని గ్రంథాలు చెబుతున్నాయి.
పిండ ప్రదానం పుత్రులు చేస్తేనే కానీ పూర్వీకుల రుణం తీరాదని అంటారు.

కానీ తప్పని పరిస్థితుల్లో మాత్రం కూతురు కూడా పిండ దానాన్ని చేయవచ్చు.ఇక పిండి ప్రదానం సమయంలో తెల్లని దుస్తులు ధరించాలి.ఇక పిండ దానం చేసిన తర్వాత నదిలో స్నానం చేయాలి.
ఇక ప్రతి ఏడాది భాద్రపద మాసం శుక్లపక్ష పౌర్ణమి నాడు పితృపక్షం ప్రారంభమవుతుంది.అయితే ఈ పితృపక్షం సుమారుగా 15 రోజులు ఉండి అమావాస్యతో ముగుస్తుంది.
అయితే పితృదేవతలు ఈ పితృపక్షం సమయం లో పక్షుల రూపంలో భూమి పైకి వచ్చి తమ కుటుంబ సభ్యులను కలిసి వెళ్తారని శాస్త్రం చెబుతోంది.అయితే ఆ రోజున పితృదేవతలను భక్తితో పూజిస్తే వారి ఆత్మ శాంతించి కుటుంబానికి ఆశీర్వాదాలు అందుతాయి.