పితృ దోషం కాలసర్ప దోషం నుంచి బయట పడటానికి ఇదే అనువైన సమయం!

మన హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి నెల కృష్ణపక్షం చివరి రోజున అమావాస్య తిథి వస్తుంది.ఈ క్రమంలోనే కొత్త సంవత్సరంలో జనవరి 2వ తేదీ ఆదివారం పుష్యమాస అమావాస్య వస్తుంది.

 Paush Amavasya Know When Is Amavasya-of Paush Month Know Its-importance Muhurat-TeluguStop.com

ఈ అమావాస్య ఎంతో పవిత్రమైనది ప్రత్యేకమైనదిగా భావిస్తారు.ముఖ్యంగా ఈ అమావాస్య పితృదేవతల కోసం ఎంతో ముఖ్యమైనదిగా చెప్పవచ్చు.

ఈ పుష్య అమావాస్య రోజున పితృ దోషం ఉన్న వారు కాలసర్ప దోషం ఉన్నవారు ప్రత్యేక పూజలు చేయించి అనంతరం ఈ దోషాల నుంచి బయట పడవచ్చు.ముఖ్యంగా పితృదేవతలకు ఈ అమావాస్య రోజున పిండప్రదానం చేసి అనంతరం దానధర్మాలు చేయడం ఎంతో మంచిది.

Telugu Hindu, Importance, Paush Amavasya, Worship-Latest News - Telugu

పుష్యమాస అమావాస్య పితృదేవతల కోసం అంకితం చేయబడినది కనుక ఈ రోజు కొన్ని పనులను చేయటం వల్ల పితృదేవతలు సంతోషించి వారి ఆత్మ భూమి నుంచి సరాసరి వైకుంఠానికి వెళ్తుందని ప్రతీతి.మరి పూర్వీకుల సంతోషం కోసం ఎలాంటి పనులు చేయాలి అనే విషయానికి వస్తే.

ఎంతో పవిత్రమైన ఈ అమావాస్య రోజున శ్రీ కృష్ణుడిని పూజించి గీతా పఠనం చేయాలి.అదేవిధంగా మన పూర్వీకులను గుర్తు చేసుకొని వారి పేరుతో దానధర్మాలను బట్టలను దానం చేయాలి.

ముఖ్యంగా ఈ రోజు రావి చెట్టుకు నీళ్లు పోయడం, రావి చెట్టు కింద దీపారాధన చేయడం ఎంతో ఉత్తమం.వీలైనంత వరకు ఈ పుష్యమాస అమావాస్య రోజు పీపుల్ చెట్టు నాటడం వల్ల ఎంతో శుభం కలుగుతుందని పండితులు చెబుతారు.

ఇలా పుష్యమాసంలో వచ్చే ఈ అమావాస్య తిథిలో పిండప్రదానాలు ప్రత్యేక పూజలు చేయించడం ద్వారా పితృ దోష కాలసర్పదోషాల నుంచి బయట పడవచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube