ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 6.05
సూర్యాస్తమయం: సాయంత్రం.6.28
రాహుకాలం: మ.12.00 ల1.30
అమృత ఘడియలు: ఉ.9.00 ల10.30 మ2.00 సా 4.00
దుర్ముహూర్తం: ఉ.11.57 మ12.48
మేషం:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయకపోవడం మంచిది.ఆరోగ్యంపట్ల జాగ్రత్త ఉండండి.ముఖ్యమైన విషయాలలో జాగ్రత్తగా ఆలోచించండి.మీరు పనిచేసే చోట సమయాన్ని వృధా చేయకండి.దీనివల్ల కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు.
వృషభం:

ఈరోజు మీకు ఆర్థికపరమైన కోర్టు సంబంధిత వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి.ఇది మీకు ఆర్థిక లాభాన్ని చేకూరుస్తుంది.దూర ప్రాంతపు నుండి అనుకొని వార్త కుటుంబం అంతటికి ఆనందాన్ని కలిగిస్తుంది.అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.
మిథునం:

ఈరోజు మీ జీవిత భాగస్వామితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.కుటుంబ సభ్యులతో కలిసి బయట సమయాన్ని ఎక్కువగా కాలక్షేపం చేస్తారు.ఆర్థికంగా కొంత డబ్బు ఖర్చు అవుతుంది.భూమికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మీ సోదరులతో చర్చలు చేస్తారు.
కర్కాటకం:

ఈరోజు మీరు ఇతర విషయాల్లో కాకుండా మీ ఆరోగ్యం పై కూడా దృష్టి పెట్టాలి.తొందరపడి మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకపోవడమే మంచిది.మీరంటే గిట్టని వారు మీ విషయాల్లో తల దూర్చడానికి ప్రయత్నిస్తారు.కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.
సింహం:

ఈరోజు మీరు ఏ పని ప్రారంభించిన త్వరగా పూర్తి చేస్తారు.మీరు పని చేసే చోట పై అధికారులతో ప్రశంసలు అందుకుంటారు.గతంలో పెట్టుబడుల నుండి మంచి లాభాలను అందుకుంటారు.మీ ఇంట్లో ఒకరి ఆరోగ్య సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది.కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.
కన్య:

ఈరోజు మీ మాటలతో ఇతరుల మనసును నొప్పిస్తారు.మీరంటే గిట్టని వారు మీ విషయాల్లో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.
మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.
తుల:

ఈరోజు ఆర్థికంగా నష్టాలు ఉన్నాయి.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.వ్యాపార విషయంలో కుటుంబ సభ్యుల నిర్ణయాలు తీసుకోవాలి.పని విషయంలో ఒత్తిడికి గురవుతారు.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.
వృశ్చికం:

ఈరోజు మీరు చేసే పనిలో కొన్ని అడ్డంకులు ఎదురవుతాయి.మీ మీ కుటుంబ సభ్యుల బాధ్యతలను అశ్రద్ధ చేయడంమంచిది కాదు.నూతన వస్తువుల కొనుగోలు చేసేముందు మీ సొంత నిర్ణయాలు కాకుండా అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడం మంచిది.లేదంటే ఇబ్బందులు ఎదుర్కొంటారు.
ధనుస్సు:

ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.బంధువుల నుండి శుభవార్త వింటారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో విజయం ఉంటుంది.
ఉద్యోగస్తులకు ఇతరుల నుండి సహాయం అందుతుంది.ఇంట్లో పండగ వాతావరణం ఉంటుంది.ఉత్సాహపరిచే కార్యక్రమంలో పాల్గొంటారు.
మకరం:

ఈరోజు దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.వ్యాపార వ్యవహారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.మిత్రులతో మాట పట్టింపులు కలుగుతాయి.
చేపట్టిన వ్యవహారాలునిదానంగా సాగుతాయి.ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త తీసుకోవాలి.ఉద్యోగమున పని ఒత్తిడి అధికమవుతుంది.
కుంభం:

ఈరోజు ఆత్మీయుల నుండిముఖ్యమైన సమాచారం అందుతుంది.ఇంకా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి.వృత్తి వ్యాపారాల్లో కొన్ని సమస్యల ఎదుర్కొంటారు.
అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది.ఇతరుల సహాయంతో కొన్ని పనులను ప్రారంభిస్తారు.
మీనం:

ఈరోజు వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది.ఆర్థిక లావాదేవీలు నిదానంగా సాగుతాయి.ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.ముఖ్యమైన వ్యవహారాలు శ్రమ అనంతరం పూర్తవుతాయి.వ్యాపారాల్లో సొంత నిర్ణయాలు అంత కలిసి రావు.వృత్తి ఉద్యోగాలు శ్రమ అధికమవుతుంది
.






