ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం:ఉదయం 05.55
సూర్యాస్తమయం:సాయంత్రం 05.49
రాహుకాలం:మ.02.36 నుంచి 03.58 వరకు
అమృత ఘడియలు:ఉ.08.45 నుంచి 09.20 వరకు
దుర్ముహూర్తం: ఉ.10.10 నుంచి 11.32 వరకు
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:

ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ నష్టాలు ఉన్నాయి.అనవసరమైన కొనుగోలు చేస్తారు.ఆర్థిక విషయం గురించి మీ కుటుంబ సభ్యులు సలహాలు అందిస్తారు.
కొన్ని ముఖ్యమైన విషయాల వల్ల కుటుంబ సభ్యులతో ఎక్కువసేపు గడపలేరు.దీనివల్ల ఇబ్బందులు ఎదురవుతాయి.మీ జీవిత భాగస్వామి నుండి బహుమతిని పొందుతారు.
వృషభం:

ఈరోజు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.వ్యాపారంలో కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి ఈరోజు అనుకూలంగా ఉంది.కొన్ని వేడుకలలో కొత్త పరిచయాలు ఏర్పడతాయి.
కొన్ని ముఖ్యమైన పనుల కోసం సమయాన్ని కేటాయిస్తారు.దీనివల్ల కాస్త ఇబ్బంది ఎదురవుతుంది.మీ జీవిత భాగస్వామి నుండి సహాయం దొరుకుతుంది.
మిథునం:

ఈరోజు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.ఇంతకు ముందు పెట్టిన పెట్టుబడి వల్ల మీకు ఈ రోజు అనుకూలంగా ఉంది.ఈరోజు ఉత్సాహంతో మీరు ముందుకు వెళ్తారు.
దీని వల్ల మంచి ఫలితాలు వస్తాయి.మీ కుటుంబ సభ్యుల నుండి సలహాలు ఉంటాయి.మీ జీవిత భాగస్వామి గురించి ఈరోజు అర్థం చేసుకుంటారు.
కర్కాటకం:

ఈరోజు ఆర్థికంగా సమస్యలు ఉన్నాయి.మీరు ఎంత పొదుపు చేయాలనుకున్నా.ఎక్కువగా ఖర్చు అవుతాయి.
దీనివల్ల ఎలాంటి ఇబ్బంది పడకండి.ఈరోజు మీ స్నేహితులతో సమయాన్ని గడుపుతారు.
ఇతరుల నుండి వ్యతిరేకమున్నా పట్టించుకోకుండా ఉండండి.మీ జీవిత భాగస్వామి మధ్య గొడవలు జరగవచ్చును.
సింహం:

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువగా ఖర్చు చేస్తారు.ఇతరులతో వాదనలకు దిగకండి.ఇతరులు చెప్పే విషయాలు మీకు అనుకూలంగా ఉంటాయి.ప్రశాంతత కోసం దూరంగా వెళ్లి కాలక్షేపం చేస్తారు.ఈరోజు కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.ఆర్థిక సమస్యల వల్ల మీ జీవిత భాగస్వామితో గొడవలు జరుగుతాయి.
కన్య:

ఈరోజు మీకు ఆర్థిక లాభాలు ఉన్నాయి.ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఆలోచించి మనశ్శాంతిగా ఉండలేకపోతారు.ఈరోజు మీ పిల్లలతో సమయాన్ని గడపడానికి ప్రయత్నించండి.మీ స్నేహతులతో సంతోషంగా గడుపుతారు.మీ వైవాహిక జీవితం ఈరోజు అందంగా ఉంటుంది.
తులా:

ఈరోజు ఆర్థికంగా కాస్త ఇబ్బంది ఉంటుంది.దీనిని అనుసరించి ఎవరికీ అప్పులు ఇవ్వకూడదు.అనవసరమైన విషయాల గురించి ఆలోచించకండి.
వ్యాపారం కోసం పెట్టే పెట్టుబడులలో ఆలోచించండి.ఈ రాశివారు ఎక్కువ ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు.ఈరోజు మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంది.
వృశ్చికం:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.దీనివల్ల భవిష్యత్తులో ఉపయోగపడతాయి.మీ స్నేహితుల నుండి సహాయం దొరుకుతుంది.
వ్యాపార విషయాల్లో ఒప్పందాలు చేసే ముందు జాగ్రత్తగా ఆలోచించండి.మీ గురించి కాస్త సమయాన్ని కేటాయించండి.మీ వైవాహిక జీవితం అద్భుతంగా ఉంటుంది.
ధనస్సు:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.కొన్ని విషయాలలో ఒత్తిడికి దూరంగా ఉండండి.ఆవేశపడకుండా ప్రశాంతంగా ఉండి ఏదైన విషయాల గురించి ఆలోచించండి.
దీనివల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది.ఇతరులతో మీ సొంత విషయాలు చెప్పకండి.మీ జీవిత భాగస్వామితో సమయం గడుపుతారు.
మకరం:

ఈరోజు ఆర్థికంగా కొంత నష్టం ఉంటుంది.మీ ఆరోగ్యం గురించి జాగ్రత్త పడాల్సి ఉంది.మీ ఆర్థిక సమస్యల వల్ల కొన్ని పనులు వాయిదా పడతాయి.
ఈరోజు మీ ఇంట్లో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.దీనివల్ల మీ వ్యక్తిత్వాన్ని నియంత్రించుకోండి.మీ జీవిత భాగస్వామితో సమయం గడుపుతారు.
కుంభం:

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉన్నాయి .మీరు కష్టపడి పని చేయడం వల్ల మీకు ప్రశంసలు అందుతాయి.దీని వల్ల ఆర్థికంగా లాభం ఉంటుంది.
ఈరోజు మీ పాత స్నేహితుడు తో సంతోషంగా గడుపుతారు.ఒక పని పూర్తి అయిన వెంటనే మరో పని గురించి ఆలోచించండి.మీ జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు.
మీనం:

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.మీరు ఈరోజు శుభవార్తను వింటారు.ఆశ్చర్యపరిచే విషయాలు ఎదురవుతాయి.
కొత్తగా ప్రాజెక్టును మొదలు పెట్టడానికి ఈరోజు అనుకూలంగా ఉంది.ఈ రాశివారు ఎక్కువగా ఒంటరితనాన్ని ఇష్టపడతారు.
ఈరోజు మీ భాగస్వామితో సంతోషంగా ఉంటారు.