ప్రయాణానికి ముహుర్తము కుదరకపోతే ఏం చేయాలో తెలుసా?

రోజువారి ప్రయాణములు, ఉద్యోగరీత్యా ప్రయాణములు, ప్రమాద స్థలాలకు వెళ్లాల్సి వచ్చినప్పుడు మహూర్తాల కోసం వెతకాల్సిన అవసరం లేదు.కానీ చాలా మంది మంచి పని చేయబోయే ముందు అంటే ఉద్యోగం కోసం వెళ్లే ప్పుడు కూడా ముహూర్తాలు చూస్తారు.

 Do You Know What To Do If You Do Not Have Time To Travel, Devotional, Pray To Go-TeluguStop.com

దీని వల్ల ఆఫీసుకు ఆలస్యంగా వెళ్లడం వంటివి జరిగి మీ మీద ఇంప్రెషన్ పోతుంది.కాబట్టి అప్పుడు అస్సలే ముహూర్తం చూడకండి.

అంతే కాకుండా ప్రభుత్వ విషయంగా, ఆరోగ్య విషయంగా, వృత్తి విషయాలలోను ప్రయాణానికి ముహుర్తములు వెతకవలసిన అవసరం లేదు.

కేవల వర్ణ్యము, దుర్ముహుర్తము మాత్రమే చూసి అవి లేని సమయంలో ప్రయాణం చేయవచ్చును.

ప్రయాణానికి ముందు భగవంతుడిని ప్రార్థించడం చాలా మంచిది.అలాగే మంచి శకునాలు, భగవంతుడి దర్శనంతో ముహుర్త దోషాలు పోతాయి.

ప్రయాణం రోజున తిథి, వార, నక్షత్రములు కుదరకపోతే, అత్యవసరంగా ప్రయాణం చేయవలసి వస్తే హనుమానంజనాసూనుః వాయుపుత్రో మహాబలః రామేష్ట ఫల్గుణ సఖః పింగాక్షో మిత విక్రమః, ఉదతిక్రమణశ్చైవ సీతా శోక వినాశకః లక్ష్మణ ప్రాణదాతాచ దశగ్రీవచ్చ దర్జమా పారాయణ చేసుకుంటూ ప్రయాణం చేయండి.సుఖ ప్రయాణం జరుగుతుంది.

గర్భవతుల విషయంలో ఆషాఢ, భాద్రపద, మౌఢ్య, కర్తరీ దోషాలు ప్రయాణా నికి చూడాల్సిన అవసరం లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube