జ్యోతిష్య శాస్త్రం ప్రకారం( Astrology ) ఒకరి జాతకం చూడాలంటే పుట్టిన సమయం, గ్రహణ స్థితిని గమనిస్తూ ఉంటారు.జన్మ నక్షత్రాన్ని బట్టి ఆ నక్షత్రంలో ఉండే నాలుగు పాదాల ఆధారంగా కూడా ఫలితాలు మారుతూ ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
రాశి చక్రం, అంశ చక్రం ఆధారంగా భవిష్యత్తును అంచనా వేస్తారు.ఒక్క వ్యక్తికి సంబంధించిన పూర్తి సమాచారం కోసం వారు పుట్టిన ఏడాది, తేదీ,సమయం పరిగణలోకి తీసుకుంటారని నిపుణులు చెబుతున్నారు.
కానీ కొన్ని సాధారణ క్వాలిటీల గురించి చెప్పేందుకు ఆయా జాతకాల జన్మించిన నెల, రాశి, నక్షత్రాన్ని పరిగణలోకి తీసుకుంటారు.ఇంగ్లీష్ నెలలు జనవరి నుంచి ప్రారంభమైతే, తెలుగు నెలలు చిత్రం నుంచి ప్రారంభమవుతాయి.
తెలుగు నెలల ప్రకారం ఏ నెలలో జన్మించిన వారి ఎలా స్వభావం ఉంటాదో ఇప్పుడు తెలుసుకుందాం.

ముఖ్యంగా చెప్పాలంటే చైత్రమాసంలో జన్మించిన వారు బలంగా ఉంటారు.ఏదైనా త్వరగా నేర్చుకుంటారు.కొత్తగా ప్రారంభించిన ఏ పని అయినా పూర్తి చేసే వరకు అసలు వదలరు.
అలాగే వైశాఖమాసంలో జన్మించిన వారు మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు.అందరికీ ఆదర్శవంతంగా నిలుస్తారు.
ముఖ్యంగా చెప్పాలంటే జ్యేష్ఠ మాసంలో జన్మించిన వారు చాలా తెలివిగలవారు.ముందు చూపు కలిగి ఉంటారు.
ఆషాడ మాసం( Ashada Masam )లో జన్మించిన వారు కష్టజీవులు ఎంత పెద్ద కష్టాన్ని అయినా ఎదురుకోవడానికి సిద్ధంగా ఉంటారు.అలాగే శ్రావణ మాసం( Sravana Masam )లో జన్మించిన వారు ప్రముఖ వ్యక్తులుగా ప్రశంసలు పొందుతారు.
సంఘంలో పేరు ప్రతిష్టలను సాధిస్తారు.ఇంకా చెప్పాలంటే భాద్రపాద మాసంలో జన్మించిన వారు అందంగా ఉంటారు.
వీరు అందరిలో కలివిడిగా ఉంటారు.ఆశ్వయుజా మాసంలో జన్మించిన వారు దయగలవారై ఉంటారు.
విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు.

కార్తీక మాసం( Karthika Masam )లో జన్మించిన వారు మహామాటకారులు.ఎదుటివారిని ఆకట్టుకోవడంలో వీళ్ళకు ఎదురే ఉండదు.మార్గశిర మాసంలో జన్మించిన వారు పరిశోధనలపై ఆసక్తి చూపిస్తారు.
వీరు ఎక్కువ ప్రాంతాలను సందర్శిస్తారు.పుష్యమాసంలో జన్మించిన వారు రహస్యాలు దాచడంలో ఘనులు.
ఏ విషయమైనా వీళ్ళకు హాయిగా చెప్పవచ్చు.ఎట్టి పరిస్థితులలోనూ మరో వ్యక్తికి రహస్యాలను చెప్పరు.
మాఘ మాసంలో పుట్టిన వారికి చదివు అంటే ఎంతో ఇష్టం.పుస్తకాల పురుగులుగా వీరు ఉంటారు.
ఫాల్గుణ మాసంలో జన్మించిన వారు కుటుంబాన్ని ప్రేమిస్తారు.కుటుంబం తర్వాత ఏదైనా అని జీవిస్తూ ఉంటారు.