సెకెండ్ వేవ్‌లో విరుచుకు పడుతున్న కరోనా వైరస్.దేశ ప్రజలకు మళ్లీ కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న సంగతి తెలిసిందే.
ఎప్పుడు, ఎలా, ఎటు నుంచి వచ్చి ఎటాక్ చేస్తుందో తెలియని ఈ మహమ్మారి.ఇప్పటికే కొన్ని లక్షల మందిని మింగేసింది.
వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నా.ఈ మాయదారి వైరస్ శరవేగంగా విజృంభిస్తూనే ఉంది.
ఇక కరోనా బారిన పడితే వైరస్ తీవ్రత దృష్ట్యా కొందరు హాస్పటల్‌లో జాయిన్ అవుతున్నారు.మరికొందరు హోం ఐసోలేషన్ లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు.
అయితే కరోనా సోకి హోం ఐసోలేషన్‌లో ఉన్న వారు తెలిసో.తెలియకో.కొన్ని తప్పులు చేస్తున్నారు.ఆ తప్పులు వారిని రిస్క్‌లో పడేస్తున్నాయి.
అందుకే హోం ఐసోలేషన్‌లో ఉన్నప్పుడు ఏం చేయాలి.? ఏం చేయకూడదు.? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.కరోనా సోకి హోం ఐసోలేషన్‌లో ఉన్న వారిలో చాలా మంది గూగుల్‌లో చూసి ఇష్టానుసారంగా మందులు వాడేస్తున్నారు.

కానీ, ఇలా చేయడం వల్ల ప్రాణాలే రిస్క్‌లో పడతాయి.అందుకే వైద్యులు సూచించిన మందులను మాత్రమే వాడాలి.అలాగే హోం ఐసోలేట్ అయిన వారు గాలి, వెలుతురు ఉండే రూమ్‌లో ఒంటరిగానే ఉండాలి.ఎవర్నీ కలవరాదు, మాట్లాడరాదు.అయితే ఒంటరిగా ఉండటం వల్ల మానసికంగా కృంగిపోయే అవకాశాలు ఎక్కువ.అందువల్ల.
మ్యూజిక్ వినడం, మంచి సినిమాలు చూడటం, ఫోన్‌లో ఫ్రెండ్స్‌తో మాట్లాడటం వంటి చేస్తే కాలక్షేపంగా ఉంటుంది.ఒంటరిగా ఉన్నమనే భావన కలగకుండా ఉంటుంది.
అలాగే హోం ఐసోలేషన్‌లో ఉన్నప్పుడు ప్రతి మూడు గంటలకు ఒకసారి ఆక్సిజన్ లెవల్స్‌ను చెక్ చేసుకోవాలి.ఒకవేళ పల్స్ రేట్ 94 శాతం కంటే తక్కువగా ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
అయితే వైద్యుడి సలహా తీసుకోకుండా మాత్రం ఆక్సిజన్ సిలిండర్‌ను యూజ్ చేయరాదు.ఇక హోం ఐసోలేషన్‌లో ఉన్నప్పుడు ఎప్పుడూ మాస్క్ ధరించాలి.తరచూ చేతులను శానిటైజ్ చేసుకోవాలి.పౌష్టికాహారాన్ని తీసుకోవాలి.రోజూ రెండు, మూడు సార్లు ఆవిరి పట్టాలి.మరియు విశ్రాంతి ఎక్కువగా తీసుకోవాలి.