మన దేశ వ్యాప్తంగా షిర్డీ సాయిబాబాకు( Shirdi Sai Baba ) ఎంతో మంది భక్తులు ఉన్నారు.అలాగే షిర్డీ సాయిబాబా భక్తులకు షిర్డీ సాయిబాబా దేవాలయం ట్రస్టు బోర్డు సభ్యులు శుభవార్త చెప్పారు.
అలాగే దేవాలయంలోని బంగారు, వెండి నిల్వలను కరిగించి నాణాలు( Coins ) తయారు చేసి భక్తులకు విక్రయించాలని కీలక నిర్ణయం తీసుకున్నారు.దీనికి మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి రావాల్సి ఉంది.
అయితే దేశంలోని ప్రముఖ దేవాలయాలలో షిర్డీ సాయిబాబా దేవాలయం ఒకటి.అలాగే షిర్డీ సాయి బాబాకు దేశ వ్యాప్తంగా ఎంతో ప్రాముఖ్యత ఉంది.
ఇంకా చెప్పాలంటే మన దేశం నలుమూలల నుంచి కాకుండా విదేశీల నుంచి సైతం వచ్చి బాబను భక్తులు దర్శించుకుంటూ ఉంటారు.
ఈ సందర్భంగా షిర్డీ సాయి బాబాకు భారీగా విరాళాలు వస్తూ ఉంటాయి.బాబాకు కొంత మంది భక్తులు( Devotees ) నగదుతో పాటు బంగారం, వెండి కానుకలను కూడా సమర్పిస్తుంటారు.అలాగే భక్తులు ఇప్పటి వరకు సమర్పించిన కానుకలలో 450 కిలోల బంగారం, 6000 కిలోల వరకు వెండి ఉందని దేవాలయ ముఖ్య అధికారులు చెబుతున్నారు.
ఈ క్రమంలో షిర్డీ సాయిబాబా దేవా స్థాన ట్రస్టు బోర్డు బంగారం, వెండిని కరిగించి పథకాలు, నాణేలను తయారు చేయించి వాటిని విక్రయించాలని ట్రస్ట్ బోర్డు సభ్యులు నిర్ణయించారు.
ఈ సందర్భంగా పలువురు బోర్డు సభ్యులు మాట్లాడుతూ దేవాలయానికి వచ్చిన కానుకలలో 450 కిలోల బంగారం, 6000 కిలోల వరకు వెండి ఉందని ఇందులో 150 కిలోల బంగారం, 6000 కిలోల వెండిని కరిగించి ఐదు, పది గ్రాముల నాణేలు, పథకాలను తయారు చేయించాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.మహారాష్ట్ర ప్రభుత్వం( Maharashtra Govt ) అనుమతిస్తే పనులు మొదలు పెట్టొచ్చని దేవాలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు వెల్లడించారు.