ఇంట్లో ఎన్ని శివలింగాలను ఉంచి పూజ చేయవచ్చు..?

సాధారణంగా మన ఇంటిలో మనఇష్ట దైవం ఫోటోలను, విగ్రహాలను పెట్టుకుని పూజ చేయడం మనం చూస్తుంటాము.ఈ క్రమంలోనే చాలా మంది వారి ఇంటిలో శివలింగాన్ని పెట్టుకొని పూజలు చేస్తుంటారు.

 Shivalinga, Worshiped, Worship, Spiritual Scholars,hindhu God,pooja In Home-TeluguStop.com

అయితే ఈ విధంగా ఇంట్లో శివలింగాన్ని పెట్టుకుని పూజ చేయవచ్చా? ఒకవేళ పూజలు చేస్తే ఎన్ని శివలింగాలను ఇంట్లో పెట్టుకోవచ్చు? ఏ విధమైనటువంటి శివలింగం ఇంట్లో ఉండకూడదు అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం…

సాధారణంగా మనం మన ఇంట్లో శివలింగాన్ని పెట్టుకుని పూజలు చేయవచ్చు.అయితే శాస్త్రం ప్రకారం ఒక ఇంటిలో ఒక శివలింగం కంటే ఎక్కువగా ఉండకూడదని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.

ఒకటి కంటే ఎక్కువగా ఉండటం వల్ల పూజా విధానంలో విఘ్నాలు కలుగుతూ అనేక సమస్యలు మనల్ని వెంటాడుతుంటాయి.అయితే ఇంట్లో శివలింగం ఉంచుకొని పూజ చేసేవారు శివలింగాన్ని ఎల్లప్పుడూ కూడా దక్షిణం వైపు చూస్తున్నట్లు పెట్టుకోవాలి.

ఈ విధంగా శివలింగాన్ని ఇంట్లో పెట్టుకుని పూజ చేయటం వల్ల మనకు ఎలాంటి కష్టాలు కలగకుండా మన జీవితం ఎంతో సుఖంగా సాగుతుంది.

ఇంట్లో శివలింగాన్ని పెట్టుకొని పూజ చేయాలి కానీ పొరపాటున కూడా తెలుపు రంగులో ఉన్నటువంటి పాలరాతి శివలింగాన్ని పెట్టుకుని పూజ చేయకూడదు.తెలుపు శివలింగాన్ని మహిళలు ముట్టుకోకూడదు కనుక ఈ విధమైనటువంటి శివలింగం ఇంట్లో ఉంచకూడదు.ఒకవేళ మన ఇంట్లో శివలింగం పూజ గదిలో కాకుండా ఈశాన్య దిశలో ఉంచి పూజ చేయటం వల్ల ఆ పరమేశ్వరుని అనుగ్రహం ఎల్లవేళలా మన ఇంటి పై ఉంటుంది.

ఎంతో పవిత్రమైన ఈ పరమేశ్వరుడి ఫోటోలు లేదా శివలింగం ఎలాంటి పరిస్థితులలో కూడా నేలపై పెట్టకూడదు.నేలపై తెలుపు వస్త్రాన్ని పరిచి ఆ తెలుపు రంగు వస్త్రంపై పరమేశ్వరుడి ఫోటోలు, శివలింగం ప్రతిష్టించవచ్చు.

ఇక పరమేశ్వరుడికి పూజ చేసే సమయంలో తప్పనిసరిగా బిల్వపత్రాలను ఉంచడం వల్ల స్వామివారి అనుగ్రహం కలిగి భక్తుల కోరికలను తప్పక నెరవేరుస్తారని పండితులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube