భక్తులకు శుభవార్త.. ఈ నెలలో కేదార్‌నాథ్ ధామ్ యాత్ర మొదలు..

కేదార్‌నాథ్ ధామ్ పోర్టల్ ను( Kedarnath Dham portal ) ఏప్రిల్ 25న తెరవనున్నట్లు అధికారులు ఈ రోజు వెల్లడించారు.ఏప్రిల్ 25 నుంచి ఈ కేదార్‌నాథ్ యాత్ర ( Kedarnath Yatra )మొదలు అవుతుందని ప్రకటించారు.

 Good News For Devotees Kedarnath Dham Yatra Starts This Month ,badrinath, Kedarn-TeluguStop.com

భక్తులు కాలినడకతో పాటు హెలికాప్టర్ ద్వారా కేదార్‌నాథ్ చేరుకోవచ్చుని దేవాలయ ముఖ్య అధికారులు తెలిపారు.కేదార్‌నాథ్ ధామ్ కు హెలికాప్టర్ లో ప్రయాణించే యాత్రికుల సౌకర్యార్థం ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్( Indian Railway Catering and Tourism Corporation ) ఆన్లైన్ బుకింగ్ సదుపాయాన్ని కల్పించింది.

రాబోయే రోజులలో చార్‌ధామ్ యాత్రను దృష్టిలో ఉంచుకొని మొత్తం 6.35 లక్షల మంది భక్తుల ఇప్పటివరకు దరఖాస్తులు చేసుకున్నారని ఉత్తరాఖండ్ టూరిజం డెవలప్మెంట్ కౌన్సిలింగ్ మార్చిలో వెల్లడించింది.వీరిలో కేదార్‌నాథ్ ధామ్‌కు 2.41 లక్షలు మరియు బద్రీనాథ్ ధామ్ కు 2.01 లక్షలు, యమునోత్రికి 95,107 మరియు గంగోత్రి ధామ్ కు 96,449 మంది భక్తులు నమోదు చేసుకున్నారని తెలిపారు.

Telugu Badrinath, Bhakti, Pushkarsingh, Devotional, Gangotri, Indianrailway, Ked

చార్‌ధామ్ యాత్రలో ఆరోగ్య పరీక్షల కోసం హెల్త్ ఎటిఎం ఏర్పాటు చేస్తామని భక్తులకు సౌకర్యవంతంగా ఉంటుందని ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి తెలిపారు.ఇంకా చెప్పాలంటే ముందుగా మార్చి 11న రుద్ర ప్రయాగ్ జిల్లా యంత్రాంగం చార్ ధామ్ యాత్ర కోసం సన్నాహాలను మొదలుపెట్టింది.హిందువులను చార్ ధామ్ యాత్రను చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు.

హిందూ ప్రముఖ తీర్థయాత్రలలో ఇది కూడా ఒకటి.బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రిని కలిపి చార్ ధామ్ వ్యవహరిస్తారు.

Telugu Badrinath, Bhakti, Pushkarsingh, Devotional, Gangotri, Indianrailway, Ked

హిమాలయాల్లో ఈ నాలుగు పుణ్యక్షేత్రాలు ఉన్నాయి.ఈ పుణ్యక్షేత్రాలు ప్రతి సంవత్సరం ఆరు నెలలు మంచుతో కప్పబడి ఉంటాయి.ముఖ్యంగా చెప్పాలంటే ఈ ఎండాకాలంలో ఏప్రిల్, మే నెలలో ఈ ఆలయాలు తిరిగి తెరవబడతాయి.అక్టోబర్ లేదా నవంబర్లో ఈ ఆలయాలను మూసేస్తారు.ఏప్రిల్ 22న యమునోత్రి, గంగోత్రి దేవాలయాలను తెరవడంతో చార్ధామ్ యాత్ర మొదలవుతుంది.ఏప్రిల్ 25 న కేదార్నాథ్, బద్రీనాథ్ దేవాలయాలు తెరుచుకోనున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube