మనం సాధారణంగా గుడికి వెళ్ళినప్పుడు గంట కొట్టి దేవుని దర్శనం చేసుకుంటూ ఉంటాం.అలాగే చిన్న పిల్లలు కూడా గంట కొట్టటానికి ఉబలాటపడుతూ ఉంటారు.
అయితే గుడికి వెళ్ళినప్పుడు గంట ఎందుకు కొడతారో తెలుసా? మనం ఇంటిలో పూజ చేసుకున్నప్పుడు,హారతి ఇచ్చే సమయంలో కూడా గంట కొడుతూ ఉంటాం.ఆలా గంట కొట్టినప్పుడు మనకు మానసిక ఆనందం కలుగుతుంది.
అంతేకాక దేవాలయానికి వెళ్ళినప్పుడు మన మనస్సులోని కోరికలను దేవుని వద్ద నివేదించటానికి గంట కొట్టి దేవుణ్ణి మేల్కొల్పుతూ ఉంటాం.
గంటలో ప్రతి భాగానికి ఒక ప్రత్యేకత ఉంది.ముఖ భాగంలో బ్రహ్మదేవుడు,ఉదర భాగంలో మహారుద్రుడు,నాలుక లో సరస్వతీ మాత, కొన భాగంలో వాసుకి మరియు పైన వుండే పిడి భాగం లో ప్రాణశక్తి వుంటుందని మన పురాణాలు చెపుతున్నాయి.మన మనస్సు బాగా లేనప్పుడు మన మనస్సు ఆధ్యాత్మిక భావనతో నిండి ఉండాలంటే భగవంతుని ముందు కంచు తో చేసిన గంటను మ్రోగిస్తే, ఆ గంట నుండి వచ్చే “ఓంకార” శబ్దం వలన మనస్సు ప్రశాంతంగా ఉంటుంది.
మన ఇంటిలో లేదా దేవాలయం లో హారతి సమయంలో గంటకొడితే దేవతామూర్తుల విగ్రహాల్లోకి దేవతలను ఆహ్వానం పలుకుతున్నామని అర్ధం.హారతి సమయంలో గంట కొట్టే సమయంలో కళ్ళు మూయరాదు.ఆ సమయం లో హారతి ఇస్తూ, గంట కొడుతూ దైవాన్ని ఆహ్వానిస్తూ పూజారి మనకు చూపిస్తున్నారని అర్ధం.
DEVOTIONAL