డబ్బింగ్ జానకి.ఎమోషన్ తో కూడిన అమ్మ పాత్రలకు పెట్టింది పేరు.
నటిగా మాత్రమే కాదు డబ్బింగ్ చెప్పడం వల్ల కూడా అమే బాగా పాపులర్ అయ్యారు.అందుకే ఆమెకు డబ్బింగ్ జానకి అనే పేరు కూడా వచ్చింది.
పైగా ఆమె నటిస్తున్న టైం లో ఇంకా జానకి అనే పేరుతో ఒక వైపు షావుకారు జానకి మరోవైపు సింగర్ జానకి ఉండటం వల్ల అమే డబ్బింగ్ జానకి గా స్థిర పడిపోయారు.ఇక అమే నటించిన సినిమాల్లో సాగర సంగమం మరియు స్వాతి ముత్యం వంటి సినిమాలు ఆమెకు బాగా పేరును తెచ్చి పెట్టాయి.
చిన్న తనం నుంచి నటి అవ్వాలని అనుకోలేదు కానీ జానకికి కుటుంబం ఆర్థిక సమస్యలతో ఉండటం వల్ల 1958 లో మొదటి సారి నటించింది.

ఆ తర్వాత కన్నడ, తమిళ్ మరియు హిందీ బాషల్లో అనేక సినిమాల్లో నటించింది.ప్రస్తుతం 73 ఏళ్ల వయసులోనూ ఆమె సినిమాలతో పాటు బుల్లి తెర పై కూడా కనిపిస్తుంది.ఇక ఆమెను ఎక్కువగా దర్శకుడు కె విశ్వనాథ్ ప్రోత్సహించే వారు.
ఆయన 17 సినిమాల్లో డబ్బింగ్ జానకి కి అవకాశాలు ఇచ్చారు. విశ్వనాథ్ సినిమాల ద్వారానే అమే బాగా ప్రాచుర్యం లోకి వచ్చారు.
శంకరాభరణం సినిమా లో అమే పాత్ర ఎంతో చక్కగా ఉంటుంది.ఇక సాగర సంగమం సినిమాలో అయితే కమల్ హాసన్ కి తల్లిగా ఆమె అద్భుతంగా నటించారు.

రోగిష్టి తల్లి కోసం కమల్ హాసన్ డ్యాన్సర్ అవ్వాలని అనుకోవడం, ఆ సమయంలో ఆమె కన్ను మూయడం వంటి సీన్స్ జనాలకు బాగా కనెక్ట్ అయ్యాయి.ఇక కమల్ హాసన్ లాంటి ఒక పెద్ద స్టార్ ఈ చిత్రంలో చనిపోయిన తల్లి కాళ్ళు పట్టుకొని ఏడుస్తూ ఉండాలి.అలాంటి సమయంలో అయితే ఏ హీరో కూడా ఒక చిన్న నటి కాళ్ళను పట్టుకోవడానికి ఒప్పుకోడు.కానీ కమల్ కి చిన్న పెద్ద అనే తార తమ్యాలు ఉండవు కాబట్టి నిజంగానే డబ్బింగ్ జానకి కాళ్ళు పట్టుకున్నాడు.
డైరెక్టర్ చెప్పగానే ఎలాంటి ఈగో కి పోకుండా కమల్ ఓకే అనడం పట్ల డబ్బింగ్ జానకి తీవ్ర భావోద్వేగానికి గురయ్యింది.







