చాలామంది తల్లిదండ్రులు కేవలం పిల్లల శారీరక ఆరోగ్యం మీదే దృష్టి పెడతారు గానీ, మానసిక ఎదుగుదల మీద అంతగా దృష్టి సారించరు.అయితే అన్నింటికన్నా మెదడు ఆరోగ్యాన్ని( Mental Health ) కాపాడుకోవడం చాలా ముఖ్యం.
ఎందుకంటే శరీరంలోని మొత్తం విధులకు మెదడే ( Brain ) కీలకమైనది కాబట్టి.అందుకే వైద్య నిపుణులు మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని అంటున్నారు.
మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ఆహారం( Food ) కీలక పాత్ర పోషిస్తుంది.సరైన ఆహారం తీసుకోవడం ద్వారా, మెదడు కణాలు, నరాలను బలంగా ఉంచుకోవచ్చు.
ఇందులో ముఖ్యంగా విటమిన్స్ కీలక పాత్ర వహిస్తాయి.

ఇక్కడ మొదటగా ‘విటమిన్ B1′ ( Vitamin B1 ) గురించి మాట్లాడుకోవాలి.విటమిన్ B1 అనేది మెదడు కణాల ఆరోగ్యం, పనితీరుకు, మొత్తంగా మెటబాలిజంకు చాలా సహకరిస్తుంది.థయామిన్ అని కూడా పిలిచే విటమిన్ B1 కార్బోహైడ్రేట్లను శక్తిగా మార్చడంలో దోహదపడుతుంది.
అదేవిధంగా ‘విటమిన్ B6’( Vitamin B6 ) అనేది వివిధ వ్యాధుల నుంచి రక్షించడంలోను, మెదడు ఆరోగ్యాన్ని ఉంచడంతో కీలక పాత్ర పోషిస్తుంది.చికెన్, గొడ్డు మాంసం, పంది, సాల్మన్, ట్యూనా చేపలు, బంగాళదుంపలు, బచ్చలికూర, అరటి పండ్లు, ఓట్స్, బ్రౌన్ రైస్ వంటి ఆహారాలలో విటమిన్ B6 అనేది ఎక్కువగా లభిస్తుంది.

అలాగే రిబోఫ్లావిన్ అని పిలిచే ‘విటమిన్ B2’ అనేది మెదడు కణాలలో ఎంజైమ్ ప్రతిచర్యలను సులభతరం చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది.పాలు, పెరుగు, చీజ్ వంటి పాల ఉత్పత్తులలో ఇది ఎక్కువగా లభిస్తుంది.ఇక ‘విటమిన్ B5’ అనేది మెదడులో వున్న కొవ్వుని రెగ్యులేట్ చేస్తుంది.అదేవిధంగా ‘విటమిన్ B3’ కూడా కొలెస్ట్రాల్‌ను ఉత్పత్తి చేయడంలో, కొవ్వును శరీరంలో శక్తిగా మార్చడంలో దోహదపడే సుమారు 400 ఎంజైమ్‌లను విడుదల చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
మజ్జిగ, బీన్స్, సాల్మన్ చేపలు, పొద్దుతిరుగుడు విత్తనాలు, ఆకుకూరలు, కూరగాయలతో పాటు రోజూ ఒక గుడ్డు తినడం ద్వారా బి విటమిన్లు పొందవచ్చు.