పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్( Harish Shankar ) దర్శకత్వంలో రాబోతున్న సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్'( Ustaad Bhagath Singh ). ఇప్పటికే ఈ కాంబోలో బ్లాక్ బస్టర్ మూవీ గబ్బర్ సింగ్ వచ్చిన విషయం తెలిసిందే.
దీంతో ఈ సినిమాపై పవర్ స్టార్ ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు.ఎప్పుడో ప్రకటించిన ఈ ప్రాజెక్ట్ పేరు మార్చి మళ్ళీ ఈ ఏడాది స్టార్ట్ చేసారు.
అయితే అలా స్టార్ట్ అయ్యి ఒక షెడ్యూల్ మాత్రమే పూర్తి చేసుకోగా వెంటనే మళ్ళీ వాయిదా పడింది.పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) రాజకీయాల పరంగా బిజీ అవ్వడంతో స్వల్ప వాయిదా తప్పలేదు.మరి తాజాగా ఈ సినిమా అతి త్వరలోనే స్టార్ట్ అవ్వనుందని సంక్రాంతికి రిలీజ్ అయ్యేందుకు టార్గెట్ పెట్టుకున్నట్టు గత రెండు మూడు రోజులుగా వార్తలు వైరల్ అవుతున్నాయి.
మరి ఈ వార్తలపై తాజాగా నిర్మాత స్పందించారు.
నిన్న వాల్తేరు వీరయ్య సినిమా( Waltair Veerayya ) 200 డేస్ వేడుక ఘనంగా జరిగింది.ఈ వేడుకలో మైత్రి మూవీ మేకర్స్( Mythri Movie Makers ) వారు ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ గురించి కూడా మాట్లాడారు.
ఈ సినిమా ఆగిపోలేదని అతి త్వరలోనే షూటింగ్ స్టార్ట్ చేస్తామని అలాగే రిలీజ్ పై కూడా స్పందించారు.వచ్చే ఏడాది సంక్రాంతికి కానీ లేదంటే సమ్మర్ రేస్ లో కానీ రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నామని కన్ఫర్మ్ చేసారు.
దీంతో ఉస్తాద్ పై వస్తున్న రూమర్స్ కు చెక్ పడింది.మరి కొత్త షెడ్యూల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చూడాలి.ఇక ఈ సినిమాలో ఇప్పటికే యంగ్ బ్యూటీ శ్రీలీల( Sreeleela ) హీరోయిన్ గా నటిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.అలాగే ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.
చూడాలి మరి రిలీజ్ డేట్ విషయంలో ఎలాంటి క్లారిటీ ఇస్తారో.