యాదా క్రిష్ణ.ఒకప్పుడు ఈ దర్శకుడు చాలా ఫేమస్.
ఆయన తీసిన సినిమాలు తెగ సందడి చేసేవి.ఆయన సినిమాలు ఒక్క తెలుగులోనే కాదు.
సౌత్ ఇండియాలో మస్త్ ఫేమస్.ఎందుకంటే ఆయన తీసినవన్నీ బూతు సినిమాలే.
అన్ని సినిమాలకు ఆయనే కథ, స్క్రీన్ ఫ్లే, నటన అన్నీ ఆయనే.ఛీ ఛీ అనుకుంటూనే జనాలు ఎగబడి చూసేది ఈయన సినిమాలు.
ఆయన తీసిన సినిమాలన్నింటీకీ జనాల్లో ఫుల్ క్రేజ్ ఉండేది.నెమ్మదిగా ఆయన సినిమాల ప్రభావం కాస్త తగ్గింది.
దానికి ఓ ప్రధాన కారణం ఉంది.ఇంతకీ అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మలయాళం నుంచి ఓ హాట్ బ్యూటీ బయల్దేరింది.నెమ్మదిగా సినిమాలు చేస్తూ సౌత్ ఇండియాలోనే బూతు సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది ఆ బరువైన అందాల భామ.ఇంతకీ తనెవరో అనుకుంటున్నారా.ఆమె షకీలా.
ఈమె సినిమాల్లో శ్రుంగారం స్థాయికి మించి ఉండేది.ఈమె దెబ్బకు యాదా క్రిష్ణ ప్రభ నెమ్మదిగా పడిపోయింది.
చివరకు షకీలా సునామీలో కొట్టుకుపోయాడు.సుమారు రెండు దశాబ్దాల పాటు బూతు సినిమా రంగాన్ని ఏలింది షకీలా.
ఒకానొక సమయంలో షకీలా సినిమా విడుదల అవుతుంది అంటే.స్టార్ హీరోలే తమ సినిమా విడుదలను వాయిదా వేసుకునేవారు.
దీన్ని బట్టి ఆమె సత్తా ఏంటో అర్థం చేసుకోవచ్చు.కొంత కాలం తర్వాత బూతు సినిమాల ప్రభావం తగ్గిపోయింది.

ప్రస్తుతం మళ్లీ అలాంటి పరస్థితి తెలుగు సినిమా పరిశ్రమలో కనిపిస్తుంది.సేమ్ బూతే ప్రధానంగా వచ్చిన తాజా సినిమాలు ఏడు చేపల కథ, డర్టీ హరి, చీకట్లో చితక్కొట్టుడు.ఈ రకం సినిమాలు ఈ మధ్య మరీ ఎక్కువయ్యాయి.ఓటీటీల్లో ఇలాంటి సినిమాలు బోలెడన్ని దర్శనం ఇస్తున్నాయి.కొన్ని సినిమాలు కథల పరంగా బాగున్నా.కొన్ని సీన్లు ఓవర్ గా ఉండటం మూలంగా ఆయా సినిమాలు బూతు సినిమాల జాబితాలోకి వెళ్లిపోతున్నాయి.ఎమ్.ఎస్ రాజు దర్శకత్వంలో వచ్చిన డర్టీ హరి సినిమా చూసి జనాలు అవాక్కయ్యారు.ఆయనేంటి బూతు సినిమా చేయడమేంటని ఆశ్చర్యపోయారు.
అయితే అతి సీన్లు మినహాయించి సినిమా బాగానే ఉందని చెప్పుకోవచ్చు.