కరోనా వ్యాక్సిన్ తోనే దాన్ని నియంత్రించ వచ్చని తెలుస్తుండగా కేంద్రం ఇప్పటికే వ్యాక్సినేషన్ ప్రక్రియని వేగవంతం చేసింది.ఈ క్రమంలో ప్రభుత్వ హాస్పిటల్స్ తో పాటుగా ప్రైవేట్ హాస్పిటల్స్ లో కూడా ఈ వ్యాక్సిన్ అందించేలా ఏర్పాటు చేశారు.
వ్యాక్సిన్ తయారీ సంస్థల నుండి 75 శాతం టీకాలు కేంద్రమే కొనుగోలు చేసి రాష్ట్రాలకు అందిస్తుండగా మిగిలిన 25 శాతం టీకాలు ప్రైవేట్ కు కేటాయించారు.అయితే ప్రైవేట్ హాస్పిటల్స్ లో టీకాలు నిరుపయోగంగా ఉంటున్నాయని తెలుస్తుంది.
కేంద్ర ఆరోగ్య శాఖ గణాకాల ప్రకారం మే నెలలో ప్రైవేట్ హాస్పిట్ల్స్ లో 17 శాతం వ్యాక్సిన్ డోస్ లు మాత్రమే వినియోగించారు.మే నెల మొత్తం 7.4 కోట్ల డోసులు దేశవ్యాప్తంగా పంపిణీ చేయగా వాటిలో 1.85 కోట్ల డోసులు ప్రైవేట్ హాస్పిటల్స్ కు కేటాయించారు.
వీటిలో ప్రైవేట్ హాస్పిటల్స్ 1.29 కోట్ల డోసులను కొనుగోలు చేయగా ఇప్పటివరకు కేవలం 22 లక్షల డోస్ లు మాత్రమే ప్రజలు తీసుకున్నారని తెలుస్తుంది.ఓ పక్క ప్రభుత్వ హాస్పిటల్స్ లో వ్యాక్సిన్ ఫ్రీగా వేస్తుంటే ప్రైవేట్ హాస్పిటల్స్ లో అధిక ధరకు వ్యాక్సిన్ వేస్తున్నారన్న భావన ఉంది.అందుకే కేంద్రం ప్రైవేట్ హాస్పిటల్స్ లో వ్యాక్సిన్ గరిష్ఠ ధరను నిర్ణయించింది.
సర్వీస్ ఛార్జీలు, పన్నులను యాడ్ చేసి రేటు ఫిక్స్ చేశారు.ఈ రేటు ప్రకారం కొవిషీల్డ్ ఒక్కో డోస్ ధర 780 రూ.లు, కొవాగ్జిన్ 1,410 రూ.లు, స్పుత్నిక్ వ్ 1,145 రూ.లుగా నిర్ణయించారు.జూన్ 21 నుండి కొత్త వ్యాక్సిన్ విధానం అమల్లోకి రానుంది.