తెలుగు సినిమా ఇండస్ట్రీలో పండగ సీజన్ వచ్చిందంటే చాలు చాలా సినిమాలు భారీ విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తూ ఉంటాయి.ఇక బాలయ్య బాబు ( Balayya Babu )హీరోగా బాబీ డైరెక్షన్ లో వచ్చిన ‘డాకు మహారాజ్’ సినిమా ఇప్పటికే 150 కోట్లకు పైన కలెక్షన్లను రాబట్టి మంచి విజయాన్ని సాధించడమే కాకుండా భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ గా నిలిచేందుకు పరుగులు పెడుతుంది.
మరి ఇలాంటి సందర్భంలో బాబీ( Bobby ) లాంటి దర్శకుడు భాలయ్య తో చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నట్టుగా తెలుస్తోంది.
ముఖ్యంగా కథ విషయంలో ఆయన చాలా కేర్ ఫుల్ గా వ్యవహరించాడు.అందువల్లే ఈ సినిమా మాస్ ప్రేక్షకులతో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ ను కూడా ఆకట్టుకోగలుగుతుంది.ఇక తెలిసిన కథే అయినప్పటికి దానిని బాబీ చాలా సెటిల్డ్ గా చెప్పే ప్రయత్నం అయితే చేశాడు.
అందువల్లే సినిమా ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయింది.తద్వారా ఈ సినిమాని చూసిన ప్రతి ఒక్కరు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటి కోసం తమ మార్క్ అనేది చూపించారు.
ముఖ్యంగా మ్యూజిక్ తో తమన్ మంచి గుర్తింపును సంపాదించుకున్నాడనే చెప్పాలి.ఇక బాలయ్య బాబు తమన్ కాంబినేషన్ లో సినిమా అంటే అది నెక్స్ట్ లెవెల్లో ఉంటుందనేది మరోసారి ప్రూవ్ అయింది.
ఇక ఇంతకుముందు బాబీ చిరంజీవి తో చేసిన ‘వాల్తేరు వీరయ్య ‘ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు.
ఇప్పుడు ఈ సినిమాతో కూడా మరో సక్సెస్ సాధించడంతో తన తదుపరి సినిమాను ఎవరితో చేయబోతున్నారనే దాని మీద ఇప్పుడు సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది.అయితే బాబీ మాత్రం మరో స్టార్ హీరో తోనే ఆయన నెక్స్ట్ సినిమాని చేయబోతున్నడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారమైతే ఆయన వెంకటేష్ తో గాని, రవితేజతో గాని తన తదుపరి సినిమాను చేసే అవకాశాలైతే ఉన్నట్టుగా తెలుస్తోంది…