డార్క్ అండర్ ఆర్మ్స్ తో చింతేలా.. నలుపును ఇలా వదిలించుకోండి..!

డార్క్ అండర్ ఆర్మ్స్.( Dark Underarms ) చాలా మందిని ఇబ్బంది పెట్టే చర్మ సమస్యల్లో ఇది ఒకటి.

 This Home Remedy Removes Darkness In Underarms Details, Underarms, Dark Underar-TeluguStop.com

అయితే ఎక్కువ శాతం మంది ఈ సమస్య గురించి ఓపెన్ గా ఇతరులతో చర్చించేందుకు పెద్దగా ఇష్టపడరు.బిగుతుగా ఉండే దుస్తులు లేదా పదే పదే షేవింగ్ మరియు వాక్సింగ్ చేయడం, రసాయనాలు ఉండే డియోడరెంట్స్ వాడటం, చనిపోయిన చర్మ కణాలు పేరుకుపోవడం, గర్భధారణ సమయంలో హార్మోన్ల మార్పులు లేదా గర్భనిరోధక మాత్రలు ఎక్కువగా వేసుకోవడం తదితర కారణాల వల్ల అండర్ ఆర్మ్స్ లో నలుపు ఏర్పడుతుంది.

ఈ సమస్యను వదిలించుకోవడం కోసం రకరకాల ప్రయత్నాలు చేసి విసిగిపోయారా.? అయితే ఇకపై చింతించకండి.

ఇప్పుడు చెప్పబోయే సింపుల్ అండ్ మోస్ట్ ఎఫెక్టివ్ రెమెడీని కనుక ప్రయత్నిస్తే అండర్ ఆర్మ్స్ లో నలుపును సులభంగా వదిలించుకోవచ్చు.అందుకోసం ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో రెండు టమాటో స్లైసెస్,( Tomato Slices ) రెండు బంగాళదుంప స్లైసెస్,( Potato Slices ) రెండు కీర దోసకాయ స్లైసెస్( Cucumber Slices ) వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్టైనర్ సహాయంతో జ్యూస్ ను ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి.ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు కాఫీ పౌడర్ వేసుకోవాలి.

అలాగే పావు టీ స్పూన్ బేకింగ్ సోడా, వన్ టీ స్పూన్ వైట్ టూత్ పేస్ట్ మరియు సరిపడా టమాటో పొటాటో కీరా జ్యూస్ వేసుకొని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.

Telugu Tips, Coffee Powder, Cucumber, Dark Underarms, Remedy, Latest, Lemon, Pot

ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని అండర్ ఆర్మ్స్ లో అప్లై చేసి 15 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై అర నిమ్మ చెక్కను తీసుకుని అండర్ ఆర్మ్స్ లో సున్నితంగా రబ్ చేసుకోవాలి.ఆపై వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకుని మంచి మాయిశ్చరైజర్ ను అప్లై చేసుకోవాలి.

వారానికి రెండు సార్లు ఈ రెమెడీని కనుక పాటిస్తే అదిరిపోయే రిజల్ట్ మీ సొంతం అవుతుంది.

Telugu Tips, Coffee Powder, Cucumber, Dark Underarms, Remedy, Latest, Lemon, Pot

కాఫీ పౌడర్, బేకింగ్ సోడా, టూత్ పేస్ట్, టమాటో, పొటాటో, కీరా.ఇవన్నీ అండర్ ఆర్మ్స్ లో ఏర్పడిన నలుపును క్రమంగా మాయం చేస్తాయి.అక్కడి చర్మాన్ని సున్నితంగా మారుస్తాయి.

చర్మం పై పేరుకుపోయిన డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తాయి.అండర్ ఆర్మ్స్ ను లోతుగా శుభ్రం చేసి తెల్లగా మెరిపించడంలో ఇప్పుడు చెప్పుకున్న రెమెడీ చాలా ఉత్తమంగా సహాయపడుతుంది.కాబట్టి తప్పకుండా ఈ రెమెడీని ప్రయత్నించండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube