ఒక్క వ్యక్తి సినిమాలపై ఇంట్రెస్ట్ ఉంది నటుడు కావడం పెద్ద విషయమేమి కాదు.సినిమాల్లో నటించాలనే కుతూహలం ఉంది, ఆ దిశగా ప్రయత్నం చేస్తే ఎదో ఒక అవకాశం దొరుకుతుంది.
ఇక మన కుటుంబంలో ఎవరైనా నటులు ఉంటె ఆ మాత్రం కష్టం కూడా అక్కర్లేదు చాల ఈజీ గా సినిమా ఇండస్ట్రీలో ప్రవేశం లభిస్తుంది.ఇక్కడ వరకు అంత ఒకే కానీ నటుడి నుంచి స్టార్ నటుడు కావాలంటే మాత్రం కష్టపడాలసిందే.
పట్టుదల విడువక కష్టపడి, ఆవగింజంత అదృష్టం తోడుగా ఉంటె చాలు స్టార్ హీరోస్ అయిపోవచ్చు.
ఈ సంఘటన కు చక్కటి ఉదాహరణ బాలకృష్ణ.
తండ్రి ఎన్టీఆర్ స్టార్ హీరో అయినా కూడా ఎంట్రీ ఇచ్చేవరకు మాత్రమే తండ్రి బాటలో ప్రయాణం చేసాడు.ఆ తర్వాత మాత్రం తాను ఎంతగానో శ్రమించాడు అని చెప్పక తప్పదు.
అవి మంగమ్మ గారి మనవడు సినిమా షూటింగ్ మొదలెట్టాలనుకుంటున్న రోజులు.బాలయ్య బాబు తో సినిమా చేయాలంటే ముందుగా పెద్దాయన కథ ఒకే చేయాల్సిందే.
ఆ తర్వాత బాలకృష్ణ సైతం ఓసారి కథ వింటారు.కానీ నిర్ణయం మాత్రం ఎన్టీఆర్ తీసుకోవాల్సిందే.

మంగమ్మగారి మనవడు సినిమా కథ విన్న ఎన్టీఆర్ కొన్ని సూచనలు చేసారు దర్శకుడికి అలాగే బాలకృష్ణకు మూడు కండిషన్స్ కూడా పెట్టారు.మొదట దర్శకుడికి కథలో భానుమతి గారి సీన్స్ పెంచాలని చెప్పారట.అందుకు తొలుత ఆవిడ ఒప్పుకోకపోతే ఏకంగా ఎన్టీఆర్ ఫోన్ చేసి ఆవిడను ఒప్పించారట.ఇక బాలకృష్ణకు ప్రతిరోజు భానుమతి గారి కంటే అరగంట ముందే షూటింగ్ లో ఉండాలని, ఆవిడా రాగానే కార్ దగ్గరికి వెళ్లి బాలయ్య డోర్ తీయాలని, కార్ దిగాక ఆమె కళ్ళకు నమస్కరం చేయాలనీ కండిషన్స్ పెట్టారట.
అందుకు ఒప్పుకున్నా బాలయ్య ఆ సినిమా షూటింగ్ అయ్యే వరకు అలాగే చేశారట.దాంతో సినిమా విడుదల సూపర్ హిట్ అయ్యింది అంతే కాదు బాలకృష్ణ రేంజ్ కూడా పెరిగిపోయింది.