వాకింగ్( walking ).అత్యంత సులభమైన వ్యాయామం ఇది.
అయితే సులభమైనదే అయినా నిత్యం వాకింగ్ చేయడం వల్ల ఆరోగ్యపరంగా అపారమైన ప్రయోజనాలు లభిస్తాయి.అయితే కొందరు వాకింగ్ ఎప్పుడు పడితే అప్పుడు చేస్తుంటారు.
ఇలా చేయడం వల్ల పెద్దగా ప్రయోజనాలు ఏమి లభించవు.వాస్తవానికి ప్రతిరోజు మార్నింగ్ టైమ్ లో వాకింగ్ చేయాలి.
మార్నింగ్ టైమ్ లో( morning time ) వాకింగ్ చేయడం వల్ల ఎక్కువ ప్రయోజనాలు పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ప్రతిరోజు ఐదు లేదా ఆరు గంటలకు నిద్ర లేచి ఒకటి లేదా రెండు గ్లాసుల వాటర్ తాగి గంట సేపు వాకింగ్ చేస్తే మీ శరీరంలో అద్భుతాలు జరుగుతాయి.
నిత్యం మార్నింగ్ వాకింగ్ చేయడం వల్ల బాడీ ఫిట్ గా మారుతుంది.శరీర బరువు అదుపులోకి వస్తుంది.బాడీలో అధిక క్యాలరీలు కరుగుతాయి.పొట్ట వద్ద పేరుకుపోయిన కొవ్వు మాయం అవుతుంది.
అలాగే మార్నింగ్ వాక్ వల్ల మెదడు చాలా చురుగ్గా మారుతుంది.ఆలోచన శక్తి, జ్ఞాపక శక్తి రెట్టింపు అవుతాయి.
డిప్రెషన్ పరార్ అవుతుంది.మైండ్ రోజంతా రిఫ్రెషింగ్ గా ఉంటుంది.

రోజు మార్నింగ్ గంట సేపు వాకింగ్ చేస్తే గుండెపోటు వచ్చే రిస్క్ చాలా వరకు తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.మోకాళ్ళ నొప్పులు, కండరాల నొప్పులు( Knee pains, muscle aches ) దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు.అయితే నిత్యం ఉదయం గంట సేపు వాకింగ్ చేస్తే నిద్రలేమి సహజంగానే దూరం అవుతుంది.

అంతేకాదు మార్నింగ్ వాక్ వల్ల చర్మం బ్రైట్ గా, టైట్ గా మారుతుంది.మొటిమలు, మచ్చలు, ముడతలు వంటివి చర్మంపై ఏర్పడకుండా ఉంటాయి.బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయి.రోజంతా ఫుల్ యాక్టివ్ గా, ఎనర్జిటిక్ గా ఉంటారు.మరియు మార్నింగ్ వాక్ వల్ల ఫిజికల్ గా, మెంటల్ గా స్ట్రాంగ్ అవుతారు.కాబట్టి వాకింగ్ ఎప్పుడు పడితే అప్పుడు కాకుండా మార్నింగ్ టైం లో చేసేందుకు ప్రయత్నించండి.