తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ నటి యాంకర్ అనసూయ భరద్వాజ్( Anasuya Bharadwaj ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.అనసూయ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.
మొన్నటివరకు యాంకర్ గా బుల్లితెరపై సత్తాను నిరూపించుకున్న అనసూయ ప్రస్తుతం నటిగా వరుసగా అవకాశాలను అందుకుంటూ క్షణం కూడా తీరిక లేకుండా గడుపుతోంది.వెండితెరపై నటిగా మంచి పేరు రావడంతో ఇక బుల్లితెరకు కు దూరంగా ఉంటూ ఎక్కువగా మూవీస్ కే ప్రాధాన్యం ఇస్తోంది.
అలా ఇప్పుడు చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది.

కాగా సినిమాల్లో ఫుల్ బిజీగా ఉంటున్న అనసూయ.ఈ ఏడాది మైఖేల్, రంగమార్తాండ, విమానం( Vimanam ) వంటి చిత్రాలతో ప్రేక్షకులను పలకరించింది.ఈ సినిమాలు మంచి సక్సెస్ ని సాధించడంతో ఈ ముద్దుగుమ్మకు మరిన్ని అవకాశాలు వచ్చి చేరాయి.
ఇప్పుడు వరుసగా హరిహర వీరమల్లు, పుష్ప 2తో పాటుగా పలు చిత్రాల్లో నటిస్తోంది.వీటితో పాటే సౌత్ ఇండస్ట్రీలోని వేరే భాషల చిత్రాల్లోనూ నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలలో నటిస్తోంది.
సోషల్ మీడియాలోనూ అనసూయ ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది.అయితే ఎక్కువగా ట్రోల్స్ కు గురౌతూ ఉంటుంది.
తరచూ ఏదో ఒక కాంట్రవర్సీతో వార్తలు నిలుస్తూనే ఉంటుంది.

ఎక్కువగా హీరో విజయ్ దేవరకొండను టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తలు నిలుస్తూ ఉంటుంది.అయితే ఇది మొన్నటిదాకా.ఎందుకంటె విజయ్ దేవరకొండతో వివాదాన్ని ముగించింది.
అలాగే అతడి తమ్ముడు ఆనంద్ దేవరకొండ( Anand Deverakonda ) సినిమాకు ఆల్ ది బెస్ట్ చెప్పింది.అంతేకాదు ఫ్యామిలీకి కూడా సమయం కేటాయిస్తోంది.
ఈ క్రమంలోనే తరచుగా తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్ ట్రిప్‌లకు కూడా వెళ్తోంది.అక్కడ ఫ్యామిలీతో కలిసి సందర్భాలను ఫొటోలు, వీడియోల్లో బంధించి వాటిని అభిమానులతో పంచుకుంటోంది.
అయితే ఇదంతా చూసిన నెటిజన్స్, ఆమె అభిమానులు అనసూయకు ఏమైంది? అసలు ఎందుకీ సడెన్ ఛేంజెస్, ఈ మార్పులకు కారణం ఏమిటి? అని తెగ మాట్లాడేసుకుంటున్నారు.ఈ క్రమంలోనే అనసూయ తాజాగా మరో కొత్త వీడియోను పోస్ట్ చేసింది.
అందులో తనలో వచ్చిన మార్పులను గురించి వివరించింది.మైండ్ సెట్ మారిపోయింది.
నా ప్రాధాన్యతలు మారాయి.నా అభిరుచులు మారాయి.
నా సహనం పెరిగింది.అంటూ తన మార్పులు గురించి తెలిపింది.







