ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 05.51
సూర్యాస్తమయం: సాయంత్రం 05.51
రాహుకాలం: మ.1.03 నుంచి 03.00 వరకు
అమృత ఘడియలు: ఉ.04.40 నుంచి 06.10 వరకు
దుర్ముహూర్తం: ఉ.05.02 నుంచి 05.53 వరకు
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:
ఈరోజు మీరు ఇతరులు చెప్పిన మాటలకు మోసపోకండి.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడం మంచిది.తోటి వారి సహాయం మీకు అందుతుంది.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.
వృషభం:
ఈరోజు మీరు చేసే పనిలో విజయం సాధిస్తారు.స్థలం కొనుగోలు చేసే ఆలోచనలో ఉంటారు.మీ సొంత నిర్ణయాలు కాకుండా అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడం మంచిది.మీ చిన్ననాటి స్నేహితులు ఈరోజు మిమ్మల్ని కలుస్తారు.
మిథునం:
ఈరోజు మీ ఆదాయం కన్నా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి.కానీ తిరిగి సంపాదించే స్తోమత మీలో ఉంటుంది.అనవసరమైన విషయాల్లో తల దూర్చకపోవడమే మంచిది.
మీ ఇంటికి అనుకోకుండా ఈరోజు బంధువులు వస్తారు.వారితో చాలా సంతోషంగా ఉంటారు.
కర్కాటకం:
ఈరోజుతో మీ కోర్టు సమస్యలన్నీ తీరిపోతాయి.కొన్ని దూరపు ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది.మీరు చేసే పనుల్లో కొన్ని అడ్డంకులు ఎదురవుతాయి.కొన్ని చెడు సవాసాలకు దూరంగా ఉండాలి.ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళితే అంతా మంచి జరుగుతుంది.
సింహం:
ఈరోజు మీరు తోబుట్టువులతో వ్యక్తిగత విషయాలు పంచుకోండి.మీ తండ్రి యొక్క ఆరోగ్యం ఈరోజు కుదుట పడుతుంది.సంతానం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.మీ జీవిత భాగస్వామితో కలిసి బయట సమయాన్ని కాలక్షేపం చేస్తారు.
కన్య:
ఈరోజు మీరు అప్పు తీరుస్తారు.కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి.మీరంటే గిట్టని వారు మీపై నిందలు మోపుతారు.
స్నేహితుల నుండి అడ్డంకులు ఎదుర్కొంటారు.కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి.
తులా:
ఈరోజు మీరు కొత్త పని ప్రారంభించడానికి సమయం అనుకూలంగా ఉంది.శత్రువులకు దూరంగా ఉండడం మంచిది.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తారు.బంధువుల నుండి ఒక శుభవార్త వింటారు.అది మిమ్మల్ని ఎంతో ఆనందపరుస్తుంది.
వృశ్చికం:
ఈరోజు వ్యవసాయ దారులు అధిక లాభాలు అందుకుంటారు.పిల్లలని విదేశాల్లో చదివించాలని ఆలోచనలో ఉంటారు.ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి.
వర్గ సంబంధిత విభేదాలు వస్తాయి.మానసిక బలహీనత ఎక్కువగా మీలో ఉంటుంది.కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.
ధనస్సు:
ఈరోజు మీరు చేసే ఉద్యోగంలో అడ్డంకులు ఎదుర్కొంటారు.గత కొంతకాలం నుండి తీరికలేని సమయంతో కడుపుతారు.కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.
పై అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు.కానీ ఏదో తెలియని బాధ మీలో ఉంటుంది.
మకరం:
ఈరోజు మీలో బలహీనత ఎక్కువగా ఉంటుంది.మీపై ఉన్న బాధ్యతలని నిర్లక్ష్యం చేస్తారు.ఇరుగుపొరుగు వారితో వాదనలకు దిగే అవకాశం ఉంది.మీ మిత్రుల వలన కొన్ని సమస్యల నుండి బయట పడతారు.ప్రయాణం వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.
కుంభం:
ఈరోజు మీరు సమాజంలో కీర్తి ప్రతిష్టలు పొందుతారు.మానసిక ఆందోళనలతో సతమతమవుతారు.మీరు చేసే పనుల్లో శ్రమ ఎక్కువగా ఉంటుంది.
విద్యార్థులు చదువులో మరింత దృష్టి పెట్టాలి.సమయాన్ని వృధా చేయకండి.
మీనం:
ఈరోజు మీరు మనోధైర్యంతో చేపట్టిన పనులు పూర్తి చేస్తారు.కుటుంబ సభ్యులతో కలిసి చాలా సంతోషంగా ఉంటారు.పిల్లల ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండడం మంచిది.నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించాలి.స్నేహితులతో చాలా సంతోషంగా ఉంటారు.
LATEST NEWS - TELUGU