హిందు సాంప్రదాయాల ప్రకారం పూజ మందిరాలను ఎంతో పవిత్రంగా భావిస్తున్నాము.పూజ మందిరాలలో మనం ఇష్టదైవంగా భావించే దేవుళ్ల విగ్రహాలను, లేదా ఫోటోలను పెట్టుకుని నిత్యం పూజలు చేస్తూ పూజిస్తుంటారు.
ఈ విధంగా ఎంతో భక్తి శ్రద్దలతో పూజలు నిర్వహిస్తున్న సమయంలో ఏదైనా చిన్న అపశృతి జరిగినవాటిని దృష్టిలో ఉంచుకొని ఏవేవో ఆలోచనలు చేస్తుంటారు.మనం పూజ చేసే సమయంలో, దీపం ఆరిపోయిన,మన ఇష్టదైవంగా భావించే దేవతా విగ్రహాలు పగిలిపోయిన మనస్సు ఎంతో ఆందోళన చెందుతుంది.
ఉన్నఫలంగా ఇలా జరగటం వల్ల ఏదైనా ప్రమాదం సంభవిస్తుందేమోనని చాలామంది ఆలోచిస్తుంటారు.
ఈ విధంగా దేవతా విగ్రహాలు పగిలిపోవడం లేదా చీలిపోవడం వంటి అనర్థాలు జరిగితే ఏ మాత్రం బాధ పడాల్సిన పని లేదని, ఇలా పగిలిపోవడం వెనుక కూడా ఒక అర్థం పరమార్థం దాగి ఉందని పండితులు చెబుతున్నారు.
మన కుటుంబ సభ్యులలో ఎవరికైనా ఏదైనా ప్రమాదం సంభవిస్తుందనే సూచికలు ఉన్నప్పుడు ఆ ప్రమాదం మనకు జరగకుండా మన ఇష్ట దైవంగా ఆరాధించే ఆ దేవతలు మన కష్టాన్ని స్వీకరించినప్పుడు ఈ విధమైన సంఘటనలు జరుగుతాయని పండితులు చెబుతున్నారు.
ఈ విధంగా విరిగిపోయిన, పగిలిపోయిన దేవతా విగ్రహాలను ఇంట్లో ఉంచుకోవడం వల్ల అరిష్టం అని భావించి ఆ విగ్రహాలను తీసుకెళ్లి ఎవరు తొక్కని ప్రదేశంలో లేదా ఆలయంలో పెట్టడం చేస్తుంటారు.

అయితే ఈ విధంగా ఎప్పుడూ చేయకూడదని పగిలిపోయిన లేదా కొద్దిగా చీలిన విగ్రహాలను గంధం పూసి వాటిని అతికించి యధావిధిగా పూజలు చేసుకోవచ్చని పండితులు చెబుతున్నారు.మన కుటుంబంలో ఎవరికైనా కాళ్లు చేతులు విరిగితే ఎలాగైతే వైద్యం చేయించుకుంటామో, దేవతా విగ్రహాలను కూడా అదేవిధంగా గంధంతో అతికించి పూజలు నిర్వహించుకోవాలని పండితులు చెబుతున్నారు.