పూర్వం క్షీర సాగర మధురంలో లభించిన అనేక వస్తువులలో లక్ష్మీదేవి( Lakshmi drevi )ని,కౌస్తుభాన్ని శ్రీహరికి సమర్పించి తక్కిన సంపద దేవతలు తీసుకున్నారు.అప్పుడు శ్రీహరి శ్రీదేవిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు.
కానీ శ్రీదేవి ఓ నారాయణ నాకు పెద్దదైన అక్క ఉన్నది.ఆ జ్యేష్ఠ కు పెళ్లి కాకుండా కనిష్టనైనా నేను వివాహం చేసుకోవడం న్యాయం కాదు.
కాబట్టి ముందు ఆమె పెళ్లికై సంకల్పించు అని కోరింది.ధర్మబద్ధమైన శ్రీదేవి మాటలను అంగీకరించిన విష్ణువు ( Lord vishnu )ఉద్దాలకుడు అనే మునికి జ్యేష్టాదేవిని సమర్పించాడు.
స్థూల వదన, వదన, అశుభకారిణి, అరుణ నేత్రి, కఠిన గాత్రి, బిరుసు శిరోజాలను కలిగిన జ్యేష్టాదేవిని ఉద్దానకుడు తన ఆశ్రమానికి తీసుకొని వచ్చాడు.

ఎప్పుడు హోమా, ధూమ సుగంధలతో, వేద నాదాలతో నిండిన ఆశ్రమాన్ని చూసి జ్యేష్టాదేవి దుఃఖిస్తూ నాకు ఈ చోటు సరిపడదనీ ఉద్దాలకుడి తో చెప్పింది.అలాగే ఎక్కడ రాత్రింబవళ్లు ఆలుమగలు దెబ్బలాడుకుంటూ ఉంటారో, ఏ ఇంట్లో అతిధులు నిరాశతో వెళ్లిపోతారో, ఎక్కడైతే వృద్ధులకు, మిత్రులకు అవమానాలు జరుగుతూ ఉంటాయో అలాంటి చోట మాత్రమే నేను ఉంటాను అని వెల్లడించింది.జ్యేష్టాదేవి మాటలకు ఆశ్చర్యపోయిన ఉద్దాలకుడు నువ్వు కోరినట్టుగా నీకు తగిన నివాస స్థాలన్ని అన్వేషించి వస్తాను అంతవరకు నువ్వు రావి చెట్టు( Sacred fig ) మొదట్లోనే కదలకుండా కూర్చొ అని చెప్పి వెళ్తాడు.

భర్త ఆజ్ఞా ప్రకారం రావిచెట్టు మొదల్లో అలాగే ఉండిపోయిన జ్యేష్టాదేవి ఉద్దాలకుడు ఎన్నాళ్ళకి రాకపోవడంతో పతి విరహాన్ని భరించలేక పెద్దగా దుఃఖభించసాగింది.ఆమె రోదన వైకుంఠంలో ఉన్న లక్ష్మీనారాయణల చెవిలో పడ్డాయి.వెంటనే లక్ష్మీ తన అక్క గారిని ఊరడించవలసిందిగా విష్ణువును కోరింది.విష్ణువు జ్యేష్టా దేవి ఎదుట ప్రత్యక్షమై ఆమెను ఉరడిస్తూ దేవి ఈ రావి చెట్టు నా అంశతో కూడి ఉంటుంది.
కాబట్టి నువ్వు దీని మూలంలోనే స్థిర నివాసం ఏర్పరచుకొని ఉండిపో ప్రతి సంవత్సరం నిన్ను పూజించే గృహస్థుల యందు లక్ష్మి నివసిస్తూ ఉంటుంది అని చెప్పాడు.ఆ నియమాలతోనే ప్రతి శనివారం రావి చెట్టును ప్రజలు పూజిస్తారు.