సంతాన‌లేమితో బాధ‌ప‌డుతున్నారా? అయితే మీ డైట్‌లో ఇవి ఉండాల్సిందే!

సంతానలేమి.ప్రస్తుత రోజుల్లో ఎందరో దంపతుల‌ను బాధ పెడుతున్న సమస్య ఇది.సంతానంతోనే ఏ వైవాహిక సంబంధమైన పరిపూర్ణం అవుతుంది.అందుకే పెళ్లయిన దంపతులు పిల్లల కోసం తెగ ఆరాట పడుతూ ఉంటారు.

 These Drinks Help To Get Rid Of Fertility Problems In Couples!, Fertility Proble-TeluguStop.com

కానీ, పెళ్లై ఏళ్లు గడుస్తున్నా కొందరికి పిల్లలు పుట్టరు.దాంతో సంతానలేమి సమస్యను నివారించుకోవడం కోసం మందులు వాడుతూ ఉంటారు.

మీరు ఈ జాబితా లో ఉన్నారా.? అయితే ఖచ్చితంగా ఇప్పుడు చెప్పబోయే డ్రింక్స్ ను మీ డైట్ లో చేర్చుకోవాల్సిందే.మరి డ్రింక్స్ ఏంటి.? వాటిని ఎందుకు డైట్ లో చేర్చుకోవాలి.? వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఉసిరికాయ, తానికాయ, కరక్కాయలతో త‌యారు చేయ‌బ‌డిన త్రిఫల పొడి ఆరోగ్యానికి ఎంత మంచి చేస్తుందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు.

అయితే సంతానలేమితో బాధపడేవారికి కూడా త్రిఫల పొడి చాలా మేలు చేస్తుంది.ఒక గ్లాస్ హాట్ వాటర్ లో వ‌న్ టేబుల్ స్పూన్ త్రిఫల పొడిని కలిపి ఉదయం సమయంలో తీసుకోవాలి.

ఈ డ్రింక్ ను తీసుకోవడం వల్ల సంతానలేమికి కారణం అయ్యే అధిక బరువు, హార్మోన్ ఇమ్‌బ్యాలెన్స్, పిసిఓడి తదితర సమస్యలు దూరమవుతాయి.

Telugu Fertility, Tips, Latest-Telugu Health Tips

అలాగే ములేటి టీ సంతానలేమి సమస్యను దూరం చేయడంలో గ్రేట్‌గా సహాయపడుతుంది.ఈ ములేటి టీ తయారీ కోసం.ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని గ్లాస్ వాటర్ పోయాలి.

వాటర్ హీట్‌ అవ్వగానే అందులో వ‌న్ టేబుల్ స్పూన్ ములేటి పౌడర్, రెండు తులసి ఆకులు, చిన్న దంచిన అల్లం ముక్క వేసి పది నిమిషాల పాటు మరిగించి ములేటి టీని ఫిల్టర్ చేసుకోవాలి.ఈ టీలో సరిపడా తేనెను కలిపి సాయంత్రం సమయంలో సేవించాలి.

ఈ ములేటి టీని తీసుకోవడం వల్ల స్త్రీ పురుషుల్లో లైంగిక సమస్యలు దూరమవుతాయి.సంతానోత్పత్తి సామర్థ్యం రెట్టింపు అవుతుంది.

ఇక దానిమ్మ జ్యూస్ కూడా సంతానలేమిని నివారించడానికి సహాయపడుతుంది.రోజుకు ఒక గ్లాస్ ద‌నిమ్మ జ్యూస్‌ను దంపతులిద్దరూ తీసుకుంటే స్త్రీలలో అండాశయ సమస్యలు న‌యం అవుతాయి.

పురుషుల్లో లైంగిక సమస్యలు తగ్గుముఖం పట్టి వీర్య నాణ్యత రెట్టింపు అవుతుంది.దాంతో పిల్లలు పుట్టే అవకాశాలు పెరుగుతాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube