పురాణాల ప్రకారం దక్ష మహర్షి కూతురు అయిన పార్వతీదేవి శివుడిపై మనసుపడి తన తండ్రి మాటను కాదని శివుణ్ని వివాహం చేసుకుంటుంది.అయితే శివుడంటే ఎంతో అసహనం ఉన్న దక్షుడు ఒకరోజు యజ్ఞం నిర్వహిస్తాడు.
ఆ యజ్ఞానికి శివుడికి ఆహ్వానం పంపించక పోయిన పార్వతీదేవి వెళ్లడంతో ఆమెకు ఎన్నో అవమానాలు ఎదురవుతాయి.ఆ అవమానాన్ని భరించలేక తన తండ్రి నిర్వహిస్తున్న యజ్ఞంలోకి దూకి చనిపోతుంది.
తన మరణ వార్త వినగానే ఎంతో ఆగ్రహంతో శివుడు పార్వతి దేవి మృతదేహాన్ని తీసుకెళ్లి కైలాసంలో ఉంచి తను నిర్వహించాల్సిన విధి మర్చి పోవడంతో సాక్షాత్తు విష్ణుమూర్తి పార్వతీదేవి శరీరాన్ని ముక్కలుముక్కలుగా చేస్తాడు.అప్పుడు పార్వతి దేవి శరీరభాగాలు 18 మొక్కలుగా విడిపోయి భూలోకంలో వివిధ ప్రాంతాలలో పడ్డాయి.
ఆ విధంగా ఆ 18 శరీర భాగాలు పడిన చోటనే అష్టాదశ పీఠాలు ఏర్పడ్డాయని పురాణాలు చెబుతున్నాయి.అయితే ఈ అష్టాదశ పీఠాలు ఏ ప్రదేశాలలో ఏర్పడ్డాయో తెలుసుకుందాం.
1) శాంకరి
: ఈ ఆలయం ఎక్కడుందో ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత లేదు.కానీ ఈ ఆలయం గురించి మాత్రం ఒక విషయం తెలుస్తోంది ఇది దేశంలోని తూర్పు తీరంలో ట్రిన్‌కోమలీలో ఉండవచ్చని భావిస్తున్నారు
2) కామాక్షి
: తమిళనాడులోని కాంచీపురంలో కంచి కామాక్షిగా వెలసి ఉన్నారు.
3) శృంఖల
:ప్రద్యుమ్న నగరం, పశ్చిమ బెంగాల్ ఇప్పుడు అక్కడ ఏ విధమైనటువంటి ఆలయ గుర్తులు లేవు.
4) చాముండి
: కర్ణాటకలోని మైసూరులో చాముండేశ్వరి అమ్మవారిగా విశేష పూజలు అందుకుంటున్నారు.
5) భ్రమరాంబిక
: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, శ్రీశైలంలో అమ్మవారు మల్లిఖార్జున స్వామి సమేతులై కొలువై ఉన్నారు.
6) జోగులాంబ
: ఆంధ్రప్రదేశ్, కర్నూలు అలంపూర్ లో కొలువై ఉన్నారు
7) మహాలక్ష్మి
: మహారాష్ట్ర కొల్లాపూర్ లో ప్రధాన దేవత విగ్రహం పై ఐదు తల శేషు చత్రం ఉంటుంది.ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం మూడు సార్లు సూర్యకిరణాలు అమ్మవారి పాదాలను తాకుతాయి.

8) మహాకాళి
: మధ్యప్రదేశ్ ఉజ్జయిని లో ఈ ఆలయం ఉంది
9) ఏకవీర
:మాహుర్యం లేదా మహార్, నాందేడ్ జిల్లా, మహారాష్ట్ర – ఇక్కడి అమ్మవారిని “రేణుకా మాతగా” కొలుస్తారు.
10) పురుహూతిక
: పిఠాపురం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది.
11) గిరిజ
: ఓఢ్య ఒరిస్సా – వైతరిణీ నది తీరాన ఉన్నది
12) మాణిక్యాంబ
: ఆంధ్రప్రదేశ్, ద్రాక్షారామంలో ఉంది
13) కామరూప
: గౌహతి అస్సాం లో అమ్మవారు కొలువై ఉన్నారు
14) మాధవేశ్వరి
: అలహాబాద్, ఉత్తరప్రదేశ్లో కొలువై ఉన్న అమ్మవారిని అలోపీ మాతగా కొలుస్తారు
15) వైష్ణవి
: హిమాచల్ ప్రదేశ్, కాంగ్రా వద్ద ఉన్న ఈ ఆలయంలో అమ్మవారి విగ్రహం ఉండదు.ఈ ఆలయంలో ఏడు జ్వాలలు పురాతన కాలం నుంచి తిరుగుతూ ఉండటం వల్ల ఈ ఆలయాన్ని జ్వాలాక్షేత్రం అని కూడా పిలుస్తారు
16) మంగళ గౌరీ
: బీహార్ రాష్ట్రంలోని, గయ ప్రాంతంలో కొలువై ఉన్నారు
17) విశాలాక్షి
: ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో కొలువై ఉన్నారు
18) సరస్వతి
: జమ్ము కాశ్మీర్ లో అమ్మవారి ఆలయం ఉంది.