Annapurna Devi Jayanti : డిసెంబర్ 8 అన్నపూర్ణాదేవి జయంతి నాడు ఇలా చేస్తే అన్ని శుభాలేనా..

హిందూమతంలో అన్నపూర్ణ దేవి జయంతికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.పంచాంగం ప్రకారం అన్నపూర్ణాదేవి జయంతి మార్గశిర పౌర్ణమి రోజున ప్రజలందరూ జరుపుకుంటూ ఉంటారు.

 If You Do This On December 8th Annapurnadevi Jayanti, It Will Be Auspicious , An-TeluguStop.com

భూమిపై ఆహారం కొరతా ఏర్పడినప్పుడు తల్లి పార్వతి అన్నపూర్ణ తల్లిగా, ఆహార దేవతగా అవతరించిందని ప్రజలు నమ్ముతారు.డిసెంబర్ 8న అన్నపూర్ణాదేవి ఆచార వ్యవహారాలతో పూజించే వారి జీవితంలో ధన ధాన్యాలకు ఎప్పుడు కొదవ ఉండదు.

ఈ సంవత్సరం అన్నపూర్ణ జయంతి గురువారం డిసెంబర్ 8 2022 ప్రజలందరూ జరుపుకుంటున్నారు.ఈరోజు ఎటువంటి వాటికి దూరంగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం.అన్నపూర్ణా దేవి జయంతి డిసెంబర్ ఏడు ఉదయం ఎనిమిది గంటల రెండు నిమిషాల నుంచి మొదలై డిసెంబర్ 8 ఉదయం 7:37 నిమిషముల వరకు ఉంటుంది.అయితే ఉదయ తిధి ప్రకారం అన్నపూర్ణ దేవి జయంతి డిసెంబర్ 8న ప్రజలందరూ జరుపుకుంటారు.

అన్నపూర్ణ జయంతి నాడు ఉదయాన్నే నిద్ర లేచి తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకోవడం ఎంతో మంచిది.

Telugu Annapurnadevi, Bakti, Devotional, Grains, Salt-Telugu Bhakthi

అన్నపూర్ణ జయంతి రోజున ఆహారాన్ని ఎప్పటికీ అవమానించకూడదు.అంటే ఆహారాన్ని అవమానించే వ్యక్తికి అతని ఇంట్లో పేదరికం ఎప్పుడూ ఉంటుంది.తల్లి లక్ష్మీదేవి అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

ఇంకా చెప్పాలంటే అన్నపూర్ణ దేవి జయంతి నాడు ఇంటికి వచ్చిన పేదవారికి ఆహార ధాన్యాలను దానం చేయడం ఎంతో మంచిది.అలాగే పేదవారిని అవమానించకుండా ఉండాలి.ఇంకా చెప్పాలంటే ఈ రోజున దానం, స్నానానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.అయితే అన్నపూర్ణ దేవి జయంతి రోజు ఉప్పు ఎట్టి పరిస్థితుల్లోనూ దానం చేయకూడదు.

Telugu Annapurnadevi, Bakti, Devotional, Grains, Salt-Telugu Bhakthi

ఉప్పు దానం చేయడం వల్ల ఇంట్లో సుఖసంతోషాలు శ్రేయస్సులు నశించిపోతాయని చెబుతూ ఉంటారు.అన్నపూర్ణ జయంతి రోజున వంటగదిని శుభ్రంగా ఉంచుకోవడం ఆ ఇంటికి ఎంతో మంచిది.ఆ తర్వాత అన్నపూర్ణ దేవిని పూజించిన తర్వాతే ఆహారాన్ని తయారు చేయాలి.అన్నపూర్ణ జయంతి రోజు ఉల్లిపాయలు, వెల్లుల్లిని అస్సలు తినకూడదు.ఇలా చేయడం వల్ల అన్నపూర్ణ దేవికి కోపం వస్తుందని చాలామంది ప్రజలు నమ్ముతారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube