మంగళవారం చేయదగిన,చేయకూడని పనులు ఏమిటి?

మంగళ వారం కుజునికి సంకేతం.కుజుడు ధరిత్రీ పుత్రుడు.

 Things To Do And Not To Do On Tuesday-TeluguStop.com

కుజగ్రహం భూమి పరిమాణం కన్నా దాదాపు సగం చిన్నదిగా ఉంటుంది.భూమిపై నివసించే వారికి కుజగ్రహ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది.

కుజుడు కలహాలకు, ప్రమాదాలకు,నష్టాలకు కారకుడు.అందువల్ల కుజగ్రహ ప్రభావం ఉండే మంగళ వారంనాడు శుభ కార్యాలను సాధారణంగా తలపెట్టరు.

ఈ రోజున గోళ్ళు కత్తిరించడం,క్షవరం మొదలైన పనులు చేయకూడదు.మంగళ వారం నాడు అప్పు ఇస్తే ఆ డబ్బు తిరిగి రావడం చాలా కష్టం.

అప్పుతీసుకున్నట్లైతే అది అనేక బాధలకు కారణమై తీరకుండా మిగిలే ప్రమాదం ఉంది.దైవ కార్యాలకూ,విద్యా ,వైద్య పరమైన ఋణాలకు ఇది వర్తించదు.

మంగళ వారం నాడు కొత్త బట్టలు వేసుకోరాదు.తలస్నానము చేయకూడదు.

ముఖ్యమైన ప్రయాణాలు చేయవలసి వస్తే భగవంతుని ధ్యానించి ప్రయాణం సాగించాలి.మంగళవారం ఉపవాసం చేసేవారు రాత్రిపూట ఉప్పు వేసిన పదార్థాలు తినరాదు.

మంగళవారం చేయదగిన పనులు

మంగళవారం ఆంజనేయుని ధ్యానించడం వల్ల ధైర్యం చేకూరుతుంది.సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వల్ల కుజగ్రహ ప్రభావం కారణంగా కలిగే అనేక ప్రమాదాలను నివారించవచ్చు.

మంగళవారం కాళికాదేవిని ధ్యానించడం వలన శత్రువుల పై జయం కలుగుతుంది.కుజునికి ప్రీతిపాత్రమైన ఎరుపు రంగు దుస్తులు ధరించడం, ఎరుపు రంగు పువ్వులతో ఇష్టదైవాన్ని పూజించడం వల్ల మంచి జరుగుతుంది.

జాతకం లో కుజగ్రహం వక్ర దృష్టితో చూస్తున్నట్లైతే ఎరుపు వస్త్రాలు ధరించరాదు.హనుమంతుడిని సిందూరం తో పూజించడం వల్ల లేదా సుబ్రమణ్య స్వామి కి పదకొండు ప్రదక్షిణలు చేయడం వల్ల దోష ప్రభావం తగ్గుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube