ద్వాపర యుగంలో భాద్రపద మాసం( Bhadrapada Masam ) కృష్ణ పక్షం అష్టమి తిధి రోజు రోహిణి నక్షత్రం( Rohini Nakshatra )లో రాత్రి కృష్ణుడు జన్మించాడు.రోహిణి నక్షత్రం 27 రాశులలో నాలుగవది అని నిపుణులు చెబుతున్నారు.రోహిణి నక్షత్రం స్వతహాగా శుభప్రదమైనది.27 నక్షత్రాలు చంద్రుడిని వివాహం చేసుకున్నాయని మరియు వారిలో రోహిణి చాలా అందంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు.ఈ రోజున జన్మాష్టమి సందర్భంగా రోహిణి నక్షత్రంలో పుట్టిన వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.రోహిణి నక్షత్రంలో జన్మించిన వ్యక్తులు చాలా ప్రజాధారణ పొందుతారు.
వీరు సత్యం మార్గాన్ని అనుసరిస్తారు.అలాగే మంచి పనులను మాత్రమే విశ్వసిస్తారు.

ఇంకా చెప్పాలంటే ఈ నక్షత్రంలో పుట్టిన వారు తమ లక్ష్యాల పట్ల అంకితభావంతో ఉంటారు.వాటిని సాధించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు.వీరి బలమైన సంకల్ప శక్తి విజయానికి పెద్ద రహస్యం అని చెప్పవచ్చు.వారు ఆచరణాత్మకంగా ఉంటారు.అలాగే వీరి మాటలతో ఇతరులను ఆకట్టుకుంటారు.ఈ నక్షత్రంలో పుట్టిన వారికి సమాజంలో గౌరవ స్థానం, ప్రతిష్టలు లభిస్తాయి.
ఇంకా చెప్పాలంటే ఈ నక్షత్రంలో పుట్టిన ప్రజలు కళాభిమానులు, మతపరమైన కార్యక్రమాల పట్ల ఆసక్తి చూపుతూ ఉంటారు.ఈ నక్షత్రంలో పుట్టిన వారికి డబ్బుకు( money ) సంపదకు ఎటువంటి లోటు ఉండదు.

ఇంకా చెప్పాలంటే రోహిణి నక్షత్రంలో పుట్టిన ఆడపిల్లలు చాలా అందంగా ( Beautiful )ఉంటారు.అలాగే మృదు స్వభావులుగా, తల్లిదండ్రుల ప్రేమ, భాగస్వామికి అంకిత భావం మరియు పిల్లలను కలిగి ఉంటారు.అలాగే ఈ నక్షత్రంలో పుట్టిన వారు తమ పనిని క్రమ పద్ధతిలో చేయడానికి ఇష్టపడతారు.అయితే రోహిణి నక్షత్రం లో పుట్టిన వారు యవ్వనంలో అదృష్టాన్ని పొందుతారు.
వారు దాదాపు 30 సంవత్సరాల వయసులో అదృష్టాన్ని పొందుతారు.శుక్రుని ప్రభావం వల్ల భౌతిక శుభాలకు, సౌకర్యాలకు ఎటువంటి లోటు ఉండదు.
ఈ నక్షత్రంలో పుట్టిన వారు ఇతరుల తప్పులను త్వరగా గుర్తిస్తూ ఉంటారు.ప్రజాదరణ కారణంగా వీరికి శత్రువులు ( Enemies )కూడా ఎక్కువగానే ఉంటారు.
DEVOTIONAL







