రంజాన్ ( Ramadan )మాసం మొదలైనప్పటి నుంచి పూర్తి అయ్యేవరకు దాదాపు ప్రతి ముస్లిం ప్రతిరోజు నమాజ్ చేసి ప్రార్థనలు చేస్తూ ఉంటారు.రంజాన్ నెల మొదలైనప్పటి నుంచి అల్లా కరుణ్యాలు కురుస్తూనే ఉంటాయి.
ఉపవాసలతో మానవత్వం పరిమళించింది పరమణిస్తుంది.అలాగే ఇఫ్తార్ విందులతో( Iftar dinners ) ప్రేమ ఆప్యాయతలు వెళ్లి విరుస్తాయి.
ఈద్గాలో నమాజులు అలింగనాలు సోదర భావాన్ని పెంచుతాయి.అసలు ఈద్ అంటే ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
రంజాన్ నెలలో ఉపవాసాలు, దైవరాధనలు, నియమ నిబంధనంగా పాటించిన వారికి ఈదుల్ ఫితర్( Eidul Fitr ) నిజంగా సంతోషదాయకమైన రోజు అని చెప్పవచ్చు.ఉపవాస రోజుల్లో దిగ్విజయంగా ముగించి, బాధలు లేకుండా అంతా సంతోషాలు పంచుకునే రోజునే ఈద్ అని అంటారు.

ఈ సంతోషాల్లో అభాగ్యులు, వితంతువులను అందరినీ భాగస్వామిలు చేసేందుకు ఫిదర్ దానం చేస్తారు.ఒక్క వ్యక్తికి సుమారు రెండు కిలోల గోధుమలు( wheat ) లేదా కొంత రుసుము కట్టి ఇంట్లో ఎందరు ఉంటే అందరి పేరున పేదలకు అందిస్తారు.అంతే కాకుండా వస్త్రాలు, నగదు ఏ రూపంలో అయినా ఫిదర్ ను చెల్లించవచ్చు .అలాగే రంజాన్ నెలలో నమాజ్ కు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది.సంతోషంలో కృతజ్ఞతలు తెలపడానికి, దుఃఖంలో సహాయాన్ని అందించడానికి మార్గం కావాలి.ఇలా సందర్భం ఏదైనా ఆయుధం నమాజ్ అని ప్రపంచ ముస్లింలందరికి మహమ్మద్ ప్రవక్త తెలియ పరిచారు.

ఈ విషయం ప్రతి ఒక్కరికీ బాగా తెలుసు.ముస్లింల అత్యంత ముఖ్యమైన రెండు పండుగలలో ఈద్ నమాజ్ తోనే పండుగ సంతోషాలు మొదలవుతాయి.ఇస్లాం ధర్మంలో నమాజ్ కు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది.నమాజ్ అశ్లీల కార్యాలను అరికడుతుంది అని దివ్య ఖురాన్లో ఉంది.రంజాన్ ఉపవాసాలు పాటించి రాత్రుళ్ళు తరావే నమాజులలో నిలబడిన దాసులకు ఇచ్చేందుకు అల్లాహ్ వద్ద ఎన్నో బహుమతులు ఉన్నాయని ఇస్లాం బోధకులు చెబుతున్నారు.నమాజ్ లో నేలమీద తలవంచి చదివే వాక్యాల చప్పుడు ఆకాశం పైనున్న ప్రభువు వింటాడు.
నమాజ్తో చేకూరే శుభాల గురించి తెలిస్తే లేవలేని స్థితిలో ఉన్నప్పటికీ కూడా పాకుకుంటూ మసీదుకు వస్తారు అని ప్రవక్త తెలిపారు.