ఇంటికి ప్రధాన ద్వారం వద్ద ఉండే గడప పై కూర్చోంటే.పెద్దలు గడప పై కూర్చోకూడదు అని చెబుతూ ఉంటారు.
దానికి కారణం ఏంటి అని ఎప్పుడైనా ఆలోచించారా.? పెద్ద వాళ్లు ఎందుకు గడప పై కూర్చోవద్దు అని చెప్పడం వెనుక ఆంతర్యం ఏమిటీ అని ఎప్పుడైనా ఎవరినైనా ప్రశ్నించారా.? అయితే మీ ప్రశ్నలకు ఇక్కడ సమాధానాలు లభిస్తాయి.మన ఇంట్లో ప్రధాన ద్వారం వద్ద ఉండే గడప పై ఎందుకు కూర్చోకూడదో.
దానికి గల కారణం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ఇంటికి ప్రధాన ద్వారం లో ఉండే గడపపై కూర్చోకూడదని వాస్తు పండితులు అంటున్నారు.
కారణం ఏమిటంటే.
ప్రధాన ద్వారంలో గల గడపకు మధ్యలో కూర్చోవడం మంచిది కాదు.
అంతే కాకుండా ప్రధాన ద్వారం లోపల గడపకు కింద ఉండే మెట్లపై కూడా కూర్చోవడం మంచిది కాదు.ఈ రెండు ప్రదేశాలలో కూర్చోవడం వల్ల ఇంటిలోనికి వచ్చే లక్ష్మీదేవిని మనం అడ్డుకున్న వాళ్లం అవుతామని వేద పండితులు చెబుతున్నారు.
అలాగే ఇల్లు కట్టుకున్న సమయంలో పూజలు చేసి కొన్ని వస్తువులను ఇంటి ప్రధాన ద్వారం వద్ద గల గడప కింద ఉంచుతాం.అలా పెట్టిన నాటి నుంచి గడప ను కూడా దేవుడిలా.
లక్ష్మీ దేవీలా మనం పూజిస్తాం అందుకే గడప పై కూర్చోకూడదని అంటారు.
అలాగే సైన్స్ ప్రకారం మన ఇంట్లోకి ప్రధాన ద్వారాల నుంచి అలాగే కిటికీల నుంచి గాలి, వెలుతురు వస్తుంటుంది.అయితే అలా వచ్చే గాలి లో ఎక్కువ బ్యాక్టీరియా, వైరస్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.దీంతో అవి నేరుగా మన పైనే పడుతాయి.
అందుకే గడప పై కూర్చోవడం మంచిది కాదని అంటారు.అలాగే గాలి ఇంట్లోకి వచ్చి ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ బయటికి తీసుకెళ్లుతుంది.
ఈ సమయం లో కూడా మనం దానికి అడ్డు గా ఉండకూడదు.అందుకే గడప పై కూర్చోవడం అరిష్టంగా భావిస్తారు.
DEVOTIONAL