చాలామంది వాస్తు నమ్ముతారు.అలాగే వాస్తు పద్ధతులను కూడా పాటిస్తారు.
కానీ తెలిసి తెలియక కొన్ని తప్పులు జరిగిపోతూ ఉంటాయి.దీంతో కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది.
సాధారణంగానే కొన్ని పనులు అనిపించినా వాటిని చేయడం వలన కష్టాలు వస్తాయి అని తెలుసుకోకుండా చేయడం వలన మనకు దరిద్రం కలుగుతుంది.మన ఇంట్లో వాస్తును పాటించడంతోపాటు కొన్ని చేయకూడని పనుల మీద కూడా జాగ్రత్త ఉండాలి.
లేదంటే మనకు అవి కష్టాలను తీసుకువస్తాయి.అయితే ఇంట్లో అస్సలు పగిలిన అద్దం ఉంచుకోకూడదు.
ఒకవేళ ఉంచుకుంటే ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది.దీంతో మనకు ఇంట్లో దరిద్రం( Poverty at home ) ఎప్పుడూ ఉంటుంది.
ఇక ఎప్పుడు కూడా భార్య ఎంగిలి కంచాన్ని భర్త చేతితో పట్టుకోకూడదు.
ఇలా చేయడం వలన ప్రతికూల ప్రభావాలు వస్తాయి.భార్యాభర్తలు సాయంత్రం సమయంలో సంభోగంలో పాల్గొనకూడదు.పొరపాటున అలా చేస్తే అరిష్టమే.
ఇక చాలామంది చీకటిలో ఆకలి వలన భోజనం చేస్తూ ఉంటారు.అయితే చీకటిలో భోజనం( Dine in the dark ) అస్సలు చేయకూడదు.
అలాగే మనం రోజు ఇల్లు ఊడ్చే చీపురును( sweeping broom ) నిలబెట్టకూడదు.అంతేకాకుండా రోకలి బండను కూడా కడగకుండా అలాగే ఉంచేయకూడదు.
రోలు రోకలి కడగకుండా ఉంచితే అశుభం కలుగుతుంది.ఇక లైట్ లు వేసిన తర్వాత ఇల్లు ఉడవడం మంచిది కాదు.
ఇలా చేయడం వలన లక్ష్మీదేవి మన ఇంటి నుంచి వెళ్ళిపోతుంది.ఇక మిగిలిన అన్నం కూడా .
చాలామంది పడేస్తూ ఉంటారు.ఇలా పడేయడం మంచిది కాదు.ఎందుకంటే నెల మీద పడ్డ అన్నాన్ని ఎవరు కూడా తొక్కకూడదు.ఇక ఎవరికైనా ఏదైనా ఇచ్చే సమయంలో లేదా తీసుకునే సమయంలో ఎడమ చేతిని( left hand ) వాడకూడదు.
కుడి చేతితోనే తీసుకోవాలి.ఇక కొంతమంది ఆడాళ్లు పడుకునే సమయంలో తాళి, గాజులు పక్కన పెట్టేస్తూ ఉంటారు.
అయితే ఇది అసలు మంచిది కాదు.ఇక స్నానం చేసి మళ్లీ విప్పిన బట్టలే వేసుకుంటూ ఉంటారు కొంతమంది.
ఇది కూడా అస్సలు మంచిది కాదు.ఇలా చేయడం వలన దరిద్ర దేవత మన ఇంట్లో తిష్ట వేసుకొని ఉంటుంది.
అందుకే వీలైనంతవరకు ఈ అలవాట్లను మానేయాలి.
DEVOTIONAL