చీకటిలో ఉన్న జనసేన పార్టీకి రాజోలు వెలుగునిచ్చిందని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు.అయితే గెలిచిన తరువాత మన ఎమ్మెల్యేలా పారిపోకూడదని కమిట్ మెంట్ ఉండాలని తెలిపారు.
అన్ని చోట్ల ఓడిపోయినా ఒక్క రాజోలు మాత్రమే గెలిచామని పేర్కొన్నారు.రాజోలు, పి.గన్నవరం నియోజకవర్గాలు తన వ్యక్తిగత పర్యవేక్షణలో ఉంటాయని చెప్పారు.అన్ని జిల్లాలకు అన్నం పెట్టేది గోదావరి జిల్లాలన్న జనసేనాని అందుకే వారాహి యాత్రను ఇక్కడ నుంచి ప్రారంభించినట్లు తెలిపారు.
సీటు ఎవరికి ఇచ్చామన్నది కాదు.అందరం కలిసి పని చేసే వ్యక్తిని ఎన్నుకున్నామా లేదా అన్నది కావాలని వెల్లడించారు.
ఈ క్రమంలో పార్టీ కోసం కష్టపడిన వారందరినీ గుర్తిస్తానని తెలిపారు.ఈసారి పి.గన్నవరంలో కూడా జనసేన జెండా ఎగరాలని సూచించారు.







