మన దేశంలో ఉన్న దాదాపు చాలా మంది ప్రజలు ప్రతి పండుగను తమ కుటుంబ సభ్యులందరితో కలిసి సంతోషంగా జరుపుకుంటారు.ముఖ్యంగా చెప్పాలంటే దసరా పండుగ( Dasara Festival ) ఈ నెలలో జరుపుకోనున్నారు.
చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా విజయదశమి పండుగను జరుపుకుంటారు.మత విశ్వాసాల ప్రకారం ఈ రోజున మాత దుర్గా మహిషాసురుడిని( Mahishasura ) సంహరించిందని దాదాపు చాలా మందికి తెలుసు.
ఇది ప్రతి ఏడాది ఆశ్వియుజ మాసంలోని శుక్లాపక్షంలోని పదవ రోజున జరుపుకుంటారు.ఈ రోజునే శ్రీరాముడు రావణున్ని సంహరించాడని చాలామంది ప్రజలు నమ్ముతారు.
ఈ సంవత్సరం దసరా పండుగను ఎప్పుడు జరుపుకుంటారో ఇప్పుడు తెలుసుకుందాం.

దసరా రోజు రావణా దహనానికి ప్రదోషకాలం ముహూర్తం ఉత్తమమైనదిగా పరిగణిస్తారు.ముఖ్యంగా చెప్పాలంటే అశ్విని మాసం శుక్లపక్ష దశమి తిధి అక్టోబర్ 23 సాయంత్రం 5:44 నిమిషముల నుంచి అక్టోబర్ 24 మధ్యాహ్నం మూడు గంటల 14 నిమిషములకు మొదలవుతుంది.ఈ సంవత్సరం విజయదశమి పండుగను అక్టోబర్ 24 వ తేదీన జరుపుకుంటారు.
ఈ రోజు సాయంత్రం 6:35 నిమిషముల నుంచి ఎనిమిది గంటల 30 నిమిషముల మధ్య రావణ దహనాన్ని నిర్వహిస్తారు.దసరాకు ఒక రోజు ముందు శాస్త్ర పూజను కూడా నిర్వహిస్తారు.

రాముడు రావణుడిని చంపడానికి ముందు దుర్గాదేవిని మరియు అతని ఆయుధాన్ని కూడా పూజించాడు.దసరా రోజున విజయ ముహూర్తం పూజకు ఉత్తమమైనది.ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటల నాలుగు నిమిషముల నుంచి రెండు గంటల 49 నిమిషముల వరకు విజయ ముహూర్తం ఉంటుంది.దసరా రోజు ఆయుధ పూజకు అనుకూలమైన సమయం అక్టోబర్ 23వ తేదీన మధ్యాహ్నం ఒకటి 58 నిమిషాల నుంచి 2.43 నిమిషముల వరకు ఉంటుంది.ముఖ్యంగా చెప్పాలంటే విజయదశమి అని కూడా పిలిచే దసరా పండుగ ఆశ్వియుజ మాసంలో శుక్లపక్షం( Shuklapaksha )లోని పదవరోజు జరుపుకుంటారు.
నవరాత్రులు ముగిసిన మరుసటి రోజు విజయదశమి అనగా దసరా జరుపుకుంటారు.దసరా పండుగ అసత్యం పై సత్యం విజయం సాధించిన పండుగ అని దాదాపు చాలామందికి తెలుసు.