సభాదీప ఫలం అంటే ఏమిటో తెలుసా?

ఎంతోమందికి చాలా సందర్భాల్లో సభా మర్యాద సన్నగిల్లుతుంది.అంటే వారు చెప్పేది సరైనదే అయినప్పటికీ… వారి మాటకు విలువ, గుర్తింపు ఉండవు.

 Do You Know The Sabhadeepa Phalam Sabhadeepa Phalam , Devotional, Pooja-TeluguStop.com

వారి మాటను ఎవరూ సముచితం అయినదని గుర్తించరు.కానీ అనతి కాలంలోనే వారి ఆలోచన, అభిప్రాయం, మాట సరైనవిగా గ్రహిస్తారు.

అయితే అందుకు విలువ మాత్రం ఉండదు.ఇటువంటివి మనలో చాలా మందికి నిత్యం జరుగుతూ ఉంటాయి.

అయితే అలాంటి వాటిని ఎలా తప్పించుకోవాలో తెలియక, ఏం చేయాలో తెలియక చాలా మంది వెనుకే ఉండిపోతారు.కానీ అటువంటి సభా మర్యాద దోషాలు సరిదిద్దు కునేందుకు శ్రావణ పూర్ణిమ ఎంతో దోహద పడుతుంది.

అయితే సభా మర్యాద పొందాలనుకునే వాళ్లు ఏం చేయాలో, ఎలా చేయాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

గోధుమ పిండి, పాలు కలిపి జ్యోతులు చేసి, దానిలో దీపం పెట్టి ఆ దీపానికి పసుపు కుంకుమలతో అలంకరించాలి.

ఆ తర్వాత పూజ చేయాలి.పూజానంతరం మన శక్తిని బట్టి నివేదన చేయాలి.

అనంతరం ఓం పౌరోహిత్య బ్రాహ్మణునకు విందు తాంబూలాది సత్కారాలు చేసి, ఆ దీపాన్ని దానం ఇవ్వాలి.ఆ తర్వాత వారి వద్ద ఆశీర్వాదం తీసుకోవాలి.

ఇలా ఐదు సంవత్సరాలు చేయాలి.మొదటి ఏడాదిలో గౌరవం, సభా మర్యాద పెరుగుతాయి.

అయితే సంకల్పంలో ఐదేళ్లని చెప్పుకోవాలి.అలాగే నిష్టగా భక్తి, శ్రద్ధలతో ఐదేళ్లు చేయాలి.

మాటకు విలువ, గౌరవం పెరిగిందంటే ఆర్థికంగా కూడా ఉన్నతమైన మార్పులు కలిగినట్లేనన్నమాట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube