ఆర్మీ సైనికుల పై ద్వేషపూరిత ప్రసంగం చేసిన బిజెపి ప్రధాన కార్యదర్శి కైలాస్ విజయ్ పై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు డిమాండ్ చేశారు.
హైదరాబాద్ బేగంబజార్ పోలీస్ స్టేషన్ లో కైలాష్ విజయ్ పై ఫిర్యాదు చేసిన అనంతరం హనుమంతరావు మాట్లాడుతూ అగ్నిపత్ పథకానికి సంబంధించి దేశ వ్యాప్త ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో అగ్ని వీరులను బిజెపి కార్యాలయాల్లో సెక్యూరిటీ గార్డులుగా తీసుకుంటామని, భారత సైనికులను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయ్ పై చర్యలు తీసుకోవాలని కోరారు.
విజయ్ కైలాష్ పై సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ బేగంబజార్ ఎస్ హెచ్ వో కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.







