తగ్గేదేలే... ఈటీవీ 'ఢీ' వేదికపై పుష్పరాజ్‌

తెలుగు బుల్లి తెరపై ఢీ షో కు ఉన్న ప్రత్యేకత ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.చాలా ఏళ్లుగా ఢీ షో కొనసాగుతూ వస్తూనే ఉంది.

 Iconic Star Allu Arjun Is The Gust For Etv Dhee 13 Finale Episode  , Allu Arjun,-TeluguStop.com

ఇప్పటి వరకు ఢీ షో వల్ల కొన్ని వందల మంది ట్యాలెంట్ బయట పడింది.ఎంతో మందిలో ఉన్న డాన్స్ ప్రతిభను బయటకు తీస్తున్న ఢీ షో ను నిర్విరామంగా నిర్వహిస్తూనే ఉన్నారు.

మల్లెమాల వారు నిర్మిస్తున్న ఈ షో ను ఈటీవీలో టెలికాస్ట్‌ చేస్తున్నారు.ప్రస్తుతం ఢీ 13వ సీజన్ జరుగుతోంది.

ప్రదీప్ హోస్ట్ గా ఆది, సుదీర్‌, రష్మి, దీపిక పిల్లిలు మెంటర్ లుగా వ్యవహరిస్తున్న ఈ షో ముగింపు దశకు వచ్చింది.ఢీ ప్రతి సీజన్‌ ఫైనల్‌ ఎపిసోడ్ కు ఒక ప్రత్యేకమైన గెస్ట్‌ రావడం జరుగుతుంది.

ఎన్టీఆర్‌ నుండి మొదలుకుని పలువురు ప్రముఖులు ఈ షో ఫినాలే ఎపిసోడ్‌ కు గెస్ట్‌ లు గా హాజరు అయ్యారు.ఇప్పుడు సీజన్‌ 13 ఫినాలే ఎపిసోడ్‌ కు గాను స్టైలిష్ స్టార్‌ ఐకానిక్ స్టార్‌ అల్లు అర్జున్‌ హాజరు కాబోతున్నాడు.

ఢీ 13వ సీజన్‌ కింగ్స్ వర్సెస్‌ క్వీన్స్ గా సాగింది.ఈ చివరి పోటీలో క్వీన్స్ నుండి ఎవరు గెలిచారు.కింగ్స్ నుండి ఎవరు గెలిచారు.ఫైనల్‌ లో పోటీ పడబోతున్నది ఎవరు అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఈ సీజన్‌ చాలా ఆసక్తికరంగా సాగింది.ఎంతో మంది కొత్త డాన్సర్స్‌ పరిచయం అయ్యారు.

అద్బుతమైన ట్యాలెంట్‌ వారి సొంతం అనిపించుకున్నారు.అలాంటి డాన్సర్ల ఫినాలే ఎపిసోడ్‌ అంటే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

అలాంటి ఎపిసోడ్‌ కు ఐకానిక్‌ స్టార్‌ పుష్ప రాజ్ అల్లు అర్జున్‌ రావడం చాలా గొప్ప విషయం గా చెప్పుకోవచ్చు.అద్బుతమైన ఈ టీవీ ఢీ షో ను తెలుగు ప్రేక్షకులు సుదీర్ఘ కాలంగా ఆధరిస్తున్నారు.

ఢీ ని 14 వ సీజన్ కు తీసుకు వెళ్లేందుకు ఎవరు ముందుకు వస్తారు అనేది చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube