మెగా హీరోల పుట్టినరోజులు వచ్చాయంటే మెగా ఫ్యాన్స్ సందడి మామూలుగా ఉండదు.వారం రోజులు ముందు నుంచే వారి హడావిడి మొదలవుతుంది.
తమ అభిమాన హీరో పేరు మీద సేవా కార్యక్రమాలు చేయడంతో సోషల్ మీడియాలో కూడా వారి కామన్ డీపీలని సిద్ధం చేసి షేర్ చేస్తూ ఉంటారు.అదే సమయంలో వాట్స్ యాప్ స్టేటస్ లో పెట్టుకొని తమ హీరో పుట్టినరోజు గురించి ఎక్కువ మందికి తెలియజేస్తూ ఉంటారు.
ఈ మధ్యకాలంలో కామన్ డీపీ అనేది సోషల్ మీడియాలో భాగా ట్రెండ్ అవుతూ వస్తుంది.హీరోల పుట్టిన రోజులు అయితే ఫ్యాన్స్ ముందుగానే వారికి సంబందించిన డీపీని సిద్ధం షేర్ వైరల్ చేస్తూ ఉంటారు.
ఇప్పుడు మెగా హీరో రామ్ చరణ్ పుట్టిన రోజు మార్చి 27న జరగనుంది.ఈ పుట్టిన రోజు వేడుకలని మెగా ఫ్యాన్స్ ఇప్పటికే మొదలు పెట్టారు మెగాస్టార్ తనయుడు, తమ అభిమాన హీరో డీపీని సిద్ధం చేసి వైరల్ చేస్తున్నారు.
రెండు రోజుల ముందుగానే కామన్ డీపీని సోషల్ మీడియాలో ట్రెండ్ చేయడం స్టార్ట్ చేశారు.
మెగాపవర్ స్టార్ అని పిలుచుకుంటారు కాబట్టి కామన్ డీపీలో బ్యాక్ గ్రౌండ్ లో బిగ్ స్టార్ ఒకటి సెట్ చేశారు.
సీడీపీలో రాంచరణ్ ఎవడు సినిమాలో ధరించిన డ్రెస్ తో స్టైలిష్ గా కనిపిస్తున్నాడు.ఇదిలా ఉంటే రామ్ చరణ్ నటిస్తున్న ఆర్ఆర్ఆర్ నుంచి పుట్టినరోజు సర్ప్రైజ్ గా మెగా ఫ్యాన్స్ కి రాజమౌళి ఒక ట్రీట్ సిద్ధం చేశాడు.
అలాగే ఆచార్య సినిమా నుంచి కూడా రామ్ చరణ్ ఫస్ట్ లుక్ టీజర్ ని రిలీజ్ చేసే అవకాశం ఉంది.అదే సమయంలో రామ్ చరణ్, శంకర్ కలయికలో దిల్ రాజు తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీకి సంబంధించి కీలక అప్డేట్ ని మార్చి 27న అందించడానికి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తుంది.