ఈ దొంగ మనసుకు అమెరికన్స్ ఫిదా...కానీ

దొంగలు అందరూ ఒకేలా ఉండరు, వారిలో కొందరు మంచి వాళ్ళు ఉంటారు, మరికొందరు చెడ్డ వారు ఉంటారు, ఇంకొందరు సైకోల్లా చంపేసే మనస్తత్వం కలిగి ఉంటారు.అందుకే అంటారు దొంగలందు మంచి దొంగలు వేరయా అని.

 Mother Leaving Baby In Car Thief Stolen Car In  Us , Baby In Car, Aragan State,-TeluguStop.com

సరే ఈ దొంగల టాపిక్ ఇప్పుడు ఎందుకు వచ్చిందనేకదా మీరు అనుకునేది అందుకు కారణం లేకపోలేదు.అమెరికాలో ఓ దొంగ చేసిన దొంగ పనికి తిట్టుకున్న అమెరికన్స్ అదే నిమిషంలో పొగడ్తలతో ముంచెత్తారు.

మరి ఇంతకీ సదరు దొంగ గారు ఏం చేశారో తెలుసా.

అమెరికాలోని ఆరెగాన్ రాష్ట్రంలో ఓ దొంగ ఓ షాపు ముందు ఉన్న ఒక స్టోర్ ముందు ఉన్న కారును ఎవరూ చూడకుండా ఎవరికీ అనుమానం కలుగకుండా కొట్టేశాడు.

కొట్టేయడమే తడవుగా వేగంగా కారులో వెళ్తున్న క్రమంలో కారునుంచి ఏడుపు వినపడింది.ఏంటా అని వెనక్కి చూసేసరికి ఏడుస్తూ ఓ చిన్నారి కనపడింది.

దాంతో నాలిక కరుచుకుని మళ్ళీ కారును వెనక్కి పోనిచ్చాడు.ఎక్కడైతే దొంగతనం చేశాడో అక్కడికే వెళ్లి కారు ఓనర్ ఎవరో తెలుసుకున్నాడు.

ఆమె బయటి రాగానే బిడ్డ తల్లిని చెడా మడా తిట్టేశాడు.నీకు బుద్ది లేదా పిల్లలను కారులో ఎవరైనా వదులుకుంటారా అంటూ పసి బిడ్డని ఆమె చేతిలో పెట్టి మళ్ళీ అదే కారులో వేగంగా వెళ్ళిపోయాడు.

Telugu Amarica, Aragan, Baby Car, Theif-Telugu NRI

ఈ ఘటనతో ఒక్క సారిగా షాక్ అయిన కారు ఓనర్ ఒక్క నిమిషం అక్కడ ఏం జరిగిందో కూడా ఆమెకు అర్థం కాలేదు.కారును ఆమెకు కొన్ని అడుగుల దూరంలో ఉంచి ఆమె వద్దకు వెళ్లి బిడ్డను అప్పగించి అదే కారులు వెళ్లిపోవడంతో అక్కడ ఉన్నవారందరూ షాక్ అయిపోయారు.తన కారు పోవడంతో సదరు మహిళ దొంగకు థాంక్స్ చెప్పుకుంటూనే పోలీసులకు ఫిర్యాదు చేసింది.దాంతో ఆమె ద్వారా నిందితుడి నమూనా ఫోటోలు గీయించిన పోలీసులు కేసు రిజిస్టర్ చేసుకుని విచారణ ప్రారంభించారు.

నెటిజన్లు మాత్రం ఆ దొంగ మనసుకు ఫిదా అయిపోయారు.కారు పొతే పోయింది బిడ్డను క్షేమంగా తిరిగి ఇచ్చేశాడు , పాపం ఏం అవసరం వచ్చిందో అతడికి అంటూ జాలి కూడా చూపిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube