Sakshi Rangarao : సాక్షి రంగారావు లో అరుదైన టాలెంట్.. అందుకే అతనికి మించిన నటుడు లేడు..

హాలీవుడ్ సినిమా( Hollywood movie ) ఇండస్ట్రీలో గుర్తుండిపోయే నటులలో చాలా తక్కువ మందే ఉంటారు.వారిలో సాక్షి రంగారావు( sakshi rangarao ) ఒకరు.

 Talented Actor Sakshi Rangarao-TeluguStop.com

సిరివెన్నెల, స్వర్ణకమలం, ఏప్రిల్ ఒకటి విడుదల వంటి సినిమాలతో ఈ నటుడు ఎంతో ఆకట్టుకున్నాడు.కామెడీ విలన్, కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇలా ఏ రోల్ లోనైనా ఒదిగిపోగల ఈ దిగ్గజ నటుడికి ఇతర టాలెంట్స్ కూడా ఉన్నాయి.

ఒకటి మాడ్యులేషన్.ఏ సందర్భంలో ఏ డైలాగును ఎలాంటి హావభావాలతో చెప్పాలో తెలిసిన నటుడితడు.

ఆంధ్రా యూనివర్సిటీలో జాబ్ చేస్తూ రంగస్థలంపై ఒక నాటకంలో డైలాగులు చెబుతూ బాపు రమణలనే ఆకట్టుకున్నాడు సాక్షి రంగారావు.ఆ విధంగా సినిమాల్లో ఛాన్సులు దక్కించుకున్నాడు.

దాదాపు 450 సినిమాల్లో ఎన్నో అద్భుతమైన క్యారెక్టర్స్ పోషించిన సాక్షి రంగారావు చివరికి కన్యాశుల్కం రిహార్సల్స్ చేస్తూ స్టేజ్ మీదే కింద పడిపోయి తుది శ్వాస విడిచారు.కన్నుమూసే చివరి క్షణం వరకు ఆయన నటిస్తూనే ఉండటం నిజంగా విశేషం.

రంగారావు పాతికేళ్ల వయసులో “కరణం” క్యారెక్టర్‌తో సాక్షి (1967) సినిమాతో వెండి తెరకు పరిచయమయ్యారు.రంగావఝ్ఝల అనేది రంగారావు అసలైన ఇంటిపేరు.అయితే మొదటి సినిమా తర్వాత దాని ప్లేస్ లో సాక్షి వచ్చి చేరింది.ఎందుకంటే మొదటి సినిమాలోనే అతను అద్భుతంగా నటించి మెప్పించాడు.

విన్నకోట రామన్న పంతులు లాంటి దిగ్గజ నటులకు పోటీగా నటించి వాహ్వా అనిపించాడు.

Telugu Hollywood, Sakshi Rangarao, Tollywood-Telugu Top Posts

మట్టిలో మాణిక్యం( mattilo manikyam ) వంటి సినిమాల్లో కామెడీ విలన్ గా అలరించిన ఈ యాక్టర్ అలాంటి మరెన్నో పాత్రలు వేశాడు.అయితే నటనకు బాగా స్కోప్ ఉన్న క్యారెక్టర్ లను ఆయనకు డైరెక్టర్ బాపు, విశ్వనాథ్, జంధ్యాల, వంశీ మాత్రమే ఇచ్చారు మిగతా వారందరూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కామెడీ విలన్ గా వాడేసారు.జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన “రెండు రెళ్లు ఆరు” సినిమాలో సాక్షి రంగారావు గంటకు 150 కిలోమీటర్ల వేగంతో మాట్లాడే ఒక సరికొత్త మేనరిజంతో ఎంతగా ఆకట్టుకున్నాడో ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు.

రంగారావుకి అద్భుతమైన కామెడీ టైమింగ్ కూడా ఉంది.రెండు రెళ్లు ఆరు సినిమా చూస్తే ఎవరైనా సరే ఆ నిజాన్ని ఒప్పుకోవాల్సిందే.

Telugu Hollywood, Sakshi Rangarao, Tollywood-Telugu Top Posts

క్యారెక్టర్ ఎంత చిన్నదైనా, పెద్దదైనా స్క్రీన్ పై కనిపిస్తే చాలు ప్రేక్షకుడి క్రిష్టంత తను మీదే ఉండేలా చేయగల పవర్ఫుల్ నటుడు సాక్షి రంగారావు.సాగర సంగమం, శంకరాభరణం, స్వరాభిషేకం వంటి సినిమాల్లో సాక్షి రంగారావు తన నట విశ్వరూపాన్ని చూపించాడు.దీనంతటికీ కారణం అతను డైలాగ్ చెప్పేటప్పుడు వాటిని సొంతంగా అనుభవించినట్లు ఫీలై చెప్పడమే అని చెప్పుకోవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube