ప్రస్తుతం మారుతున్న కాలానికి అనుగుణంగా టెక్నాలజీ కూడా మారుతూ వస్తుంది.ఇటీవలే కాలంలో టీవీలు లేని ఇల్లు ఉండవేమో.
ఇంట్లో ఖరీదైన టీవీ ఉన్న కూడా కొన్ని సినిమాలు టీవీలలో కంటే సినిమా థియేటర్లలో చూస్తేనే అనుభూతి లభిస్తుంది.కొంతమంది వేలకు వేలు ఖర్చు చేసి మరి ఇంట్లో ప్రొజెక్టర్ పెట్టుకుంటున్నారు.
ధనవంతులకైతే పర్వాలేదు కానీ మధ్య తరగతి కుటుంబాలకు ఇది అసాధ్యం.మధ్యతరగతి కుటుంబాలకు టీవీలే థియేటర్ల తో సమానం.
ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్డ్ ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మధ్యతరగతి వారు సైతం ఇంట్లోనే థియేటర్లో చూసే అనుభూతి పొందాలంటూ తక్కువ బడ్జెట్ లోనే ఓ మినీ ప్రొజెక్టర్ ను మార్కెట్లోకి తెచ్చింది.మినీ ప్రొజెక్టర్ కు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.
UNIY UY 40 మినీ ప్రొజెక్టర్ ఇటీవలే మార్కెట్లోకి వచ్చింది.దీని మార్కెట్ ధర రూ.12661.అయితే కంపెనీ దీనిపై 62% డిస్కౌంట్ ప్రకటించడంతో కేవలం రూ.4740 లకే కస్టమర్లు పొందవచ్చు.దీన్ని స్క్రీన్ సైజ్ 35×120 అంగుళాలు, రిజల్యూషన్ 800×480.
HDMI/AV/AUX/USB (1000 lm/రిమోట్ కంట్రోలర్).

ఇందులో 30 వేల గంటల లాంపోలే, ఫేస్ ప్రొజెక్టర్ తో గరిష్టంగా 1000 ల్యూమన్ ల బ్రైట్ నేస్ ఉంటుంది.ఈ ఫీచర్స్ తో ఇంట్లో కూర్చుని థియేటర్లో చూస్తున్న అనుభూతి పొందవచ్చు.పైగా ఇది పోర్టబుల్ కాబట్టి ప్రయాణాలలో సులువుగా ఒక చోటు నుండి మరొక చోటికి తీసుకువెళ్లవచ్చు.
ఇది తక్కువ స్థలాన్ని ఆక్రమించడం పాటు తేలికగా ఉంటుంది.ఈ పోర్టబుల్ ప్రొజెక్టర్ ఫ్లిప్కార్ట్ లో అందుబాటులో ఉంది.







