రామ్ చరణ్ పెట్టుకున్న వాచ్ ఖరీదెంతో తెలుసా..?

సినిమాసినిమాకు కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకునే స్టార్ హీరోలు వాడే వస్తువుల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు ఆ వస్తువుల కోసం ఎక్కువ మొత్తం ఖర్చు చేస్తున్నారు.ఈ నెల 27వ తేదీన స్టార్ హీరో రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకను ఘనంగా జరుపుకున్న సంగతి తెలిసిందే.

 Interesting Facts About Ram Charan Watch And Tshirt, Interesting Facts, Ram Char-TeluguStop.com

చరణ్ బర్త్ డే సందర్భంగా ఆర్ఆర్ఆర్, ఆచార్య సినిమాల నుంచి విడుదలైన ఫోటోలు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ సొంతం చేసుకున్నాయి.

అయితే చరణ్ పుట్టినరోజు సందర్భంగా దిగిన ఫోటోలలో లగ్జరీ వాచ్ తో పాటు టీషర్ట్ లో కనిపించారు.

అయితే టీషర్ట్, వాచ్ ఖరీదెంతో తెలిసి అవాక్కవడం నెటిజన్ల వంతవుతోంది.చరణ్ ధరించిన బ్రాండెడ్ టీషర్ట్ ఖరీదు ఏకంగా 76,069 రూపాయలు కావడం గమనార్హం.మరో ఫోటోలో రామ్ చరణ్ లగ్జరీ వాచ్ తో కనిపించగా ఆ వాచ్ ఖరీదు కోటి రూపాయల కంటే ఎక్కువ మొత్తం కావడం గమనార్హం.చరణ్ వాచ్ కోసం ఏకంగా కోటి రూపాయల 9 లక్షల 18 వేల 566 రూపాయలు ఖర్చు చేశారు.

Telugu Ram Charan, Tshirt, Watch-Movie

త్రివిక్రమ్ డైరెక్షన్ లో తెరకెక్కిన అత్తారింటికి దారేది సినిమాలోలా రామ్ చరణ్ వాచ్ అమ్మితే బ్యాచ్ సెటిలైపోవచ్చని నెటిజన్లు కామెంట్లు చేస్తుండటం గమనార్హం.ప్రస్తుతం ఒక్కో సినిమాకు రామ్ చరణ్ 40 కోట్ల రూపాయలకు అటూఇటుగా పారితోషికం తీసుకుంటున్నారని తెలుస్తోంది.చరణ్ ప్రస్తుతం ఆచార్య, ఆర్ఆర్ఆర్ సినిమాల్లో నటిస్తుండగా మేలో ఆచార్య విడుదల కానుండగా అక్టోబర్ లో ఆర్ఆర్ఆర్ విడుదల కానుంది.

రెండు సినిమాల దర్శకులు ఇప్పటివరకు తెరకెక్కించిన సినిమాలలో ఒక్కటి కూడా ఫ్లాప్ కాకపోవడంతో చరణ్ ఈ ఏడాది బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్లు సాధిస్తాడని ఫ్యాన్స్ భావిస్తుండటం గమనార్హం.

ఈ సినిమా తరువాత స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో చరణ్ సినిమా తెరకెక్కనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube